ఈ మధ్య ఏ పెద్ద
తెలుగు సినిమా తీసుకున్నా...తమన్నా పేరు తప్పకుండా వినిపిస్తోంది.
పవన్ కళ్యాణ్, జూఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు
అర్జున్, ప్రభాస్, రామ్ ఇలా టాప్
హీరోలాంతా ఆమె వెంటే పడుతున్నారు.
ఈ నేపథ్యంలో తమన్నా సినిమాకు కోటి డిమాండ్ చేస్తోందటూ
ఈ మధ్య మీడియాలో వార్తలు
వచ్చాయి.
అయితే
ఈ వార్తలను తమన్నా ఖండిస్తోంది. నేను నా పారితోషికాన్ని
కోటి రూపాయలకు పెంచేశానని, ప్రతి సినిమాకు కోటి
డిమాండ్ చేస్తున్నానని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు. ఇంత వరకు
కోటి ఇవ్వండి అంటూ ఎవ్వరినీ డిమాండ్
చెయ్యలేదు. నా పారితోషికాన్ని పెంచితే
ఆ విషయాన్ని దాచుకోకుండా చెప్పేస్తాను అంటోంది.
తెలుగులో
ఏ హీరో సరసన నటించాలని
ఎదురు చూస్తున్నారని ప్రశ్నిస్తే ‘ప్రతీ ఒక్కరికీ ఇండస్ట్రీలోని
క్రేజీ హీరోల సరసన నటించాలని
వుంటుంది. కానీ నాకు మాత్రం
అలాంటి ఆలోచన లేదు. కాలం
కలిసొస్తే అందరూ మన వెంటపడతారు’ అంటూ
ధీమా వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం తమన్నా పవన్ కళ్యాణ్ సరసన
‘కెమెరామెన్ గంగతో రాంబాబు’, ప్రభాస్తో ‘రెబెల్’, రామ్ హీరోగా రూపొందుతున్న
‘ఎందుకంటే ప్రేమంట’ చిత్రాల్లో నటిస్తోంది.
ఇంకా
చాలా మంది హీరోలు తమన్నా
డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు.
అమ్మడుకి బాలీవుడ్ అవకాశాలు వస్తున్నా.....ఇక్కడ వరుస సినిమాలతో
బిజీగా ఉంటుండటంతో వెళ్ల లేక పోతోందట.
0 comments:
Post a Comment