దేవ కట్టా దర్శకత్వంలో నాగచైతన్య
హీరోగా రూపొందుతున్న చిత్రం ‘ఆటోనగర్ సూర్య’.
ఈ చిత్రంలో నాగచైతన్య పాత్ర పేరు సూర్య.
అతని గురించి దర్శకుడు దేవకట్టా చెపుతూ..అతను అనాథే కావొచ్చు.
కానీ అనామకుడు మాత్రం కాదు. ఆటోనగర్ అంటే
ఆ ఊళ్లో అందరికీ తెలుసు.
అయితే ఆ పేరు వినబడగానే
అక్కడ సూర్య అనే ఓ
యువకుడు ఉంటాడనే విషయం కూడా గుర్తుకు
తెచ్చుకొంటారు. అదీ అతను సంపాదించిన
పేరు. తెలిసిన పని చేసుకొంటూ, ప్రాంతానికి
తగ్గట్టు ఎదగాలనుకొనే రకం అతను. ఇలాంటి
యువకుడి జీవితానికి ఎవరు అడ్డుగా నిలిచారు?
వారికి సూర్య ఎలా సమాధానం
చెప్పాడు? అనే విషయాల్ని తెరపైనే
చూడాలి అన్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో తీర్చిదిద్దిన ఓ
ప్రత్యేక సెట్లో క్లైమాక్స్
సీన్స్ ని తెరకెక్కిస్తున్నారు.
ఈ చిత్రంలో స్టోరీ లైన్ ఏమిటంటే...విజయవాడలో
బెంజ్ సర్కిల్ ఎంత ఫేమసో... ఆటోనగర్
సూర్య కూడా అంతే. తనకు
తెలిసిన పని చేసుకొంటూ... ఆ
రంగంలో ఎదగాలనుకొనే రకం. ఒకరి హక్కును
కబ్జా చేస్తే మాత్రం ఊరుకోడు. అందుకే సూర్య పేరు చెబితే
రౌడీమూక గుండెల్లో కంగారు మొదలవుతుంది. ఇలాంటి మనస్తత్వమున్న సూర్య జీవితంలోకి ఎవరెవరు
వచ్చారు? అతని ప్రయాణానికి అడ్డుగా
నిలిచిన వారికి ఎలా బుద్ధిచెప్పాడు? తదితర
విషయాలు తెలియాలంటే 'ఆటోనగర్ సూర్య' చిత్రం చూడాల్సిందే. ఈ చిత్రంలో హీరోయిన్
గా సమంత చేస్తోంది.
మాక్స్
ఇండియా ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి
నిర్మాత కె.అచ్చిరెడ్డి. ఈ
చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ ''మాస్ అంశాలకు ప్రాధాన్యమున్న
చిత్రమిది. నాగచైతన్య కెరీర్లో ఓ మైలురాయిగా
నిలిచిపోతుంది. యాక్షన్, భావోద్వేగాలకి చోటుంది. దర్శకుడు దేవాకట్టా తనదైన శైలిలో చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. అందరికీ వినోదాల్ని పంచే చిత్రమిది. దేవాకట్టా
మంచి కథతో ఈ చిత్రాన్ని
చేస్తున్నాడు. కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉన్న స్టయిలిష్
ఫిలిమ్ ఇది. హీరో క్యారెక్టర్
డిఫరెంట్ షేడ్స్తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
నాగచైతన్యను పెద్దరేంజ్కి తీసుకువెళ్లే ప్రొటెన్షీయాలిటీ
ఉన్న కథ ఇది. నిర్మాత
వెంకట్కు కూడా ఈ
కథ నచ్చడంతో చిత్రం నిర్మించడానికి పూనుకున్నాం అని వివరించారు''అన్నారు.
హీరో
నాగచైతన్య మాట్లాడుతూ దేవాకట్టా చెప్పిన కథ చాలా బాగుంది.
నా పాత్ర అద్భుతంగా మలచడానికి
ఆయన ప్రయత్నిస్తుండడంతో నేను ఈ చిత్రానికి
చేయడానికి పూనుకున్నాను. హీరోగా నాకు మంచి చిత్రం
అవుతుంది. కథాబలమున్న చిత్రమిది. యాక్షన్ నేపథ్యంలో సాగుతుంది. ప్రేమ, వినోదాంశాలకు ప్రాధాన్యముంది. అన్ని వివరాలు త్వరలో
తెలియజేస్తాను అని తెలిపారు. ఈ
చిత్రంలో సాయికుమార్ ముఖ్యభూమిక పోషిస్తున్నారు. సంగీతం: అనూప్రూబెన్స్, సమర్పణ:
ఆర్.ఆర్.మూవీమేకర్స్. ఈ
చిత్రానికి నిర్మాత: కె.అచ్చిరెడ్డి, కథ,
స్క్రీన్ప్లే, దర్శకత్వం: దేవాకట్టా.
0 comments:
Post a Comment