బాలకృష్ణ
తాజా చిత్రం అధినాయకుడు రిలీజ్ డేట్ ని ప్రకటించి
చాలా సార్లు మారుస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ
ఈ చిత్రం రిలీజ్ డేట్ పై నిర్మాతలనుంచి
క్లారిటీ లేదు. దాంతో ఈ
చిత్రం పై రకరకాల కథనాలు
మొదలయ్యాయి. తాజాగా ఈ చిత్రం విడుదలకు
బాలకృష్ణే విలన్ లాగ అడ్డుపడుతున్నాడంటూ
వెబ్ మీడియాలో వార్తలు మొదలయ్యాయి. బాలకృష్ణకు ఈ చిత్రానికి చెయ్యాల్సిన
పే మెంట్ పూర్తిగా చేయకపోవటంతో
దాన్ని ల్యాబ్ దగ్గరే అగుతోందని చెప్పుకుంటున్నారు. బాలకృష్ణ కు అరవై లక్షలు
పెండింగ్ ఉందని చెప్తున్నారు.
మరో ప్రక్క నిర్మాత ఈ సినిమాను విడుదల
చేయటానికి తన ఇల్లుని,ప్లాట్
ని అమ్మేయటానికి రెడీ అవుతున్నారంటూ రూమర్
మొదలైంది. చిత్రం మీద చేసిన ఫైనాన్స్
వదిలించటానికే ఆస్దులు అమ్ముతున్నాడని,సినిమాకు పెద్దగా బిజినెస్ జరగలేదంటూ చెప్పుకుంటున్నార. ఇక ఈ రూమర్స్
ని కొంతమంది కావాలనే క్రియేట్ చేస్తున్నారని ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్తున్నారు.
అయితే
బడ్దెట్ ఎక్కువైన మాట వాస్తవమే అయినా
బాలకృష్ణ కు ఉన్న క్రేజ్
కు అదేమీ ఎక్కువ కాదని
చెప్తున్నారు. అందులోనూ సినిమా చాలా బాగా వచ్చిందని,
ముఖ్యంగా సెకండాఫ్ అందరికీ నచ్చే ఎమోషన్స్ తో
తయారైందని అంటున్నారు. ఇక బాలకృష్ణ అభిమానలుకు
మాత్రమే కాక అందరికీ నచ్చే
చిత్రం ఇది అంటున్నారు దర్శకుడు.
అలాగే... కథ గురించి దర్శకుడు
మాట్లాడుతూ...నాయకత్వం వ్యాపారం కాదు... వారసత్వంగా రావటానికి. వెనకనున్న పదిమంది ఆశల్ని, ఆకాంక్షల్ని నెరవేర్చాలి. అప్పుడే నాయకుడు అవుతాడు. అలాంటివాళ్లు మాత్రమే ప్రజల మనసుల్లో స్థానం
సంపాదించుకొంటారు. తరతరాలుగా ప్రజాసేవకు అంకితమై నాయకత్వ లక్షణాల్ని పుణికి పుచ్చుకొన్న ఓ కుటుంబం కథే
మా చిత్రం అంటున్నారు.
ఇక ఈ చిత్రంలో బాలకృష్ణ
త్రిపాత్రాభినయం చేస్తుండటం విశేషం. పరుచూరి మురళి దర్శకత్వంలో ఎమ్.ఎల్ కుమార్చౌదరి
నిర్మిస్తోన్న ఈ చిత్రం ఆరు
పాటలు సహా చిత్రీకరణ పూర్తి
చేసుకుంది. బాలకృష్ణ ఇందులో తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్నారు.‘అధినాయకుడు’ చిత్రాన్ని కీర్తి కంబైన్స్ పతాకంపై ఎమ్మెల్ కుమార్ చౌదరి నిర్మిస్తు న్నారు.
ఈ చిత్రంలో లక్ష్మీరాయ్, చార్మి, సలోని హీరోయిన్లుగా నటిస్తున్నారు.
కళ్యాణి మాలిక్ కంపోజ్ చేసిన అన్ని పాటలు
చాలా అద్భుతంగా వచ్చా యని అంటున్నారు.
నవంబర్లో ఈ చిత్రం
ఆడియో విడుదల కాబోతుందని వినికిడి. శ్రీరామ రాజ్యం వంటి భక్తి రసాత్మక
చిత్రం తర్వాత ఔట్ అండ్ ఔట్
కమర్షియల్ మూవీగా ‘అధినాయకుడు’ రాబోతోంది.
దర్శకుడు
పరుచూరి మురళి ఈ చిత్రం
గురించి మాట్లాడుతూ ..“ ప్రజలకు సేవ చేసే నిజమైన
నేత, వారి కష్ట సుఖాలలో
పాలు పంచుకునే నేత ఎలా ఉండాలో
అధినాయకుడు చూపిస్తుందని చెప్పిన మాటలు కూడా మరింత
ఆసక్తి పెంచుతున్నాయి. ఈ సినిమాలో సీనియర్
ఎన్టీఆర్ రాజకీయ విశేషాలు కూడా కలగలిసి ఉండవచ్చని
పిల్మ్ నగర్ టాక్. ఇక
ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్లుగా సలోని,
లక్ష్మి రాయ్ నటిస్తున్నారు.గతంలో
చెన్నవకేశవరెడ్డి, ఒక్క మగాడు చిత్రాల్లో
ఓల్డేజ్ గెటప్ లో కనిపించిన
బాలయ్య అధినాయకుడులో మరోసారి ఆ క్యారెక్టర్ చేస్తున్నారు.
తాతగా,
తండ్రిగా, తనయుడిగా ఒకదానితో ఒకటి పొంతనలేని పాత్రల్లో
ఆయన కనిపిస్తారు. జయసుధ, సలోని, లక్ష్మీరాయ్ ఆ మూడు పాత్రలకు
జోడీలుగా నటిస్తున్నారు. కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం,
చరణ్రాజ్, ఎమ్మెస్నారాయణ,
వేణుమాధవ్, ఆదిత్యమీనన్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న
ఈ చిత్రానికి ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, సమర్పణ: సందీప్.
0 comments:
Post a Comment