2వేల మంది భామలా...?
వినడానికే ఆశ్చర్య కరంగా ఉంది కదూ. బహుషా ఇంత మంది ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమాకు పని
చేసి ఉండరు కదూ. అయితే ఫిల్మ్ నగర్లో ఆ సక్తికర విషయం వినిపిస్తోంది. మహేష్ బాబు హీరోగా
సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలోని 2000 మంది భామలను ఉపయోగిస్తున్నారట.
ఈరోజు అన్నపూర్ణ స్టూడియోలో 600 మందితో చిత్రీకరణ జరిపారట. ఇంత మందితో అయితే ఈ సినిమా
బడ్జెట్ ఏరేంజిలో ఉంటుందో? మరి ఈ వార్తల్లో నిజం ఎంతో నిర్మాతలే తేల్చాలి.
ఈ చిత్రంలో కాజల్
అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ ఆధ్వర్యంలో పాట చిత్రీకరిస్తున్నారు.
మహేష్‌తో ‘దూకుడు’ చిత్రాన్ని నిర్మించిన 14రీల్స్ సంస్థ
ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. రొమాంటిక్ చిత్రాల
దర్శకుడిగా గుర్తింపుపొందిన సుకుమార్ దర్శకత్వంలో మహేష్‌బాబు తొలిసారిగా నటిస్తుండటంతో
ఈ చిత్రం ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేస్తోంది. సంక్రాంతి నాటికి ఈ చిత్రం ప్రేక్షకుల
ముందుకు రానుంది.
సినిమా కథ విషయానికొస్తే...
గోవా బ్యాక్ డ్రాప్‌తో ఈ చిథ్ర కథ నడుస్తుందని తెలిసింది. అంతే కాకుండా ఇందులో మహేష్
బాబు తొలిసారిగా సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించనున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
మహేష్ బాబు ఇందులో లెక్చరర్ పాత్ర చేస్తున్నారని అంటున్నారు.
ప్రస్తుతం మహేష్
బాబు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంలో నటిస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల
దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు.
వెంకటేష్, మహేష్ బాబు, సమంత, అంజలి ప్రధాన పాత్రలుగా మల్టీ స్టారర్ గా ఈ చిత్రం రూపొందుతోంది.
0 comments:
Post a Comment