ప్రభాస్
తాజా చిత్రం రెబెల్ షూటింగ్ మొదలయ్యి చాలా కాలం అయిన
సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో
ఈ చిత్రంపై నెగిటివ్ రూమర్స్ కూడా స్ర్రెడ్ అయ్యాయి.
ఈ నేపధ్యంలో నిర్మాతలు వాటిని కొట్టి పారేస్తూ...తమ చిత్రం ప్రస్తుతం
క్లైమాక్స్ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుపుకుందని,దాదాపు ఇరవై రోజులు పాటు
ముప్పై మంది రష్యన్ ఫైటర్స్
తో షూట్ చేసారని చెప్పారు.
అలాగే జూల్ నెలలో రిలీజ్
చేస్తామని అన్నారు. ఇక మే 1 నుంచి
కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుందని ఇదే లాస్ట్ షెడ్యూల్
అని వివరించారు. రాఘవ లారెన్స్ డైరక్ట్
చేస్తున్న ఈ చిత్రాన్ని జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మిస్తున్నారు.
అయితే
లారెన్స్ మాత్రం ఈ చిత్రం గురించి
మీడియాలో ఊదరకొడుతున్నాడు. ఈ చిత్రంలో ప్రభాస్
క్యారక్టరైజేషన్ చాలా డిఫెరెంట్ గా
ఉంటుందంటున్నారు దర్శకుడు లారెన్స్. ఆయన ఈ విషయమై
మాట్లాడుతూ...మా సినిమా లో
హీరో కూర్చుని కబుర్లు చెప్పే రకం కాదు. రంగంలోకి
దిగి చేసి చూపిస్తాడు. ఏటికి
ఎదురీదడం అతనికిష్టం. పోరాడైనా గెలవడం అతని నైజం. ఇంతకీ
అతని లక్ష్యం ఏంటి? అనేది మా
చిత్రంలో చూడాల్సిందే అన్నారు.
అలాగే
ప్రభాస్ శైలికి సరిపోయే చిత్రమిది.‘రెబల్’ అనే టైటిల్ మత్రమే
కాదు. కథ కూడా ప్రభాస్
కోసమే అన్నట్టుగా ఉంటుంది. ‘రెబల్’ అనే టైటిల్ మత్రమే
కాదు. కథ కూడా ప్రభాస్
కోసమే అన్నట్టుగా ఉంటుంది. ప్రభాస్ కెరీర్లో మాస్ ప్రేక్షకులను
ఎక్కువగా ఆకట్టుకున్న సినిమా ‘ఛత్రపతి’.
ఆ సినిమాను మించే స్థాయిలో మా
‘రెబల్’
ఉంటుంది మాస్ని అలరించేలా
ఫైట్ సీన్స్ ఉంటాయి. ఎంటర్టైన్మెంట్ అందరికీ నచ్చుతుంది అన్నారు.
అలాగే
ప్రభాస్ సైతం ఈ చిత్రం
పై చాలా కాన్ఫిడెంట్ గా
ఉన్నారు. ఆయన ఈ చిత్రం
గురించి చెపుతూ..షూటింగ్ టైమ్ లోనే నాకు
మంచి కిక్ ఇస్తున్న సినిమా
ఇది. లారెన్స్ ఎక్స్ట్రార్డినరీగా తీస్తున్నాడు.
నా ఫ్యాన్స్కి నచ్చే అంశాలన్నీ
ఇందులో ఉంటాయి.ఇందులో నా లుక్ డిఫరెంట్గా ఉంటుంది. టైటిల్కి తగ్గట్టుగా స్టైలిష్గా, పక్కా మాస్గా ఉంటుందీ సినిమా
అని ప్రభాస్ చెప్తున్నారు. తమన్నా, దీక్షాసేథ్ హీరోయిన్స్ గా చేస్తున్న ఈ
చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం:
తమన్, కెమెరా: సి.రాంప్రసాద్, మాటలు:
‘డార్లింగ్’స్వామి,
ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, నిర్మాణం:
బాలాజీ సినీ మీడియా.
0 comments:
Post a Comment