హైదరాబాద్:
తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు నాయకులు బహిరంగంగా వీధికెక్కారు. తమ పార్టీ ప్రధాన
కార్యదర్శి వర్ల రామయ్యకు కళ్లు
నెత్తికెక్కాయంటూ తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి, సినీ
నటుడు బాబూ మోహన్ మండిపడ్డారు.
బాబూ మోహన్ను ఉద్దేశించి
వర్ల చేసిన ఒక వ్యాఖ్య
ఇరువురు నాయకుల మధ్య వాగ్వివాదానికి దారి
తీసింది. రెండు రోజుల కింద
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్ను విమర్శిస్తూ
- ఒక చిత్రంలో బాబూ మోహన్ పాల్గొన్న
ఓ సన్నివేశాన్ని వర్ల రామయ్య ఉదహరించారు.
అయితే..
బాబూ మోహన్ పేరు ప్రస్తావించకుండా
ఒక కమెడియన్ అంటూ మాట్లాడారు. మీడియా
ప్రతినిధులు సోమవారం ఈ ప్రస్తావన తెచ్చినప్పుడు
బాబూ మోహన్ భగ్గుమన్నారు. "వర్ల బుద్ధి
లేకే ఇలా మాట్లాడుతున్నాడు. బాబూ
మోహన్ అంటే తెలియనివాడు రాష్ట్రంలో
ఉండటానికే అనర్హుడు. చిన్నారుల నుంచి పండు ముదుసలి
వరకూ అందరికీ నేను తెలుసు.. ఆయనకు
తెలియదా? మా పార్టీ అధ్యక్షుడు
చంద్రబాబు తన పక్కన కూర్చోబెట్టుకొనేసరికి
కళ్ళు నెత్తికెక్కాయి. ఒకప్పుడు నన్ను చూడటానికి రోడ్డు
పక్కన నిలబడినవాడు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాడు. రేపు
తన తల్లిదండ్రులు ఎవరో కూడా తెలియదంటాడేమో''
అని బాబూ మోహన్ వ్యాఖ్యానించారు.
వర్ల
రామయ్య ఇటీవలి కాలంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్పై
తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి
గురించి కూడా తీవ్ర పదజాలమే
వాడుతున్నారు. ఆయన విమర్శలు వ్యక్తిగత
స్థాయికి చేరుకుంటున్నాయనే విమర్శ ఉంది. వైయస్ రాజశేఖర
రెడ్డికి, వైయస్ జగన్కి
మధ్య ఇంట్లో ఎప్పుడూ ఘర్షణ జరుగుతూ ఉండేదని,
ఈ విషయాన్ని విజయమ్మ ఓ సీనియర్ మంత్రికి
చెప్పుకుని బాధపడ్డారని ఆయన అన్నారు.
మద్యం
అక్రమ వ్యవహారాల్లో పీకల్లోతు కూరుకుపోయిన ఉప ముఖ్యమంత్రి దామోదర
రాజనర్సింహపై ఏసీబీ విచారణ జరపాలని
బాబూ మోహన్ డిమాండ్ చేశారు.
మెదక్ జిల్లాలో మద్యం షాపులన్నీ దామోదర
రాజనర్సింహ సిండికేటు ఆధీనంలో ఉన్నాయని, అందులో 35- 40 షాపులు తెల్లరేషన్ కార్డులున్న నిరుపేదల పేర్లతో ఉన్నాయని, రాజనరసింహ ఇంట్లో బట్టలు ఉతికే వ్యక్తి, డ్రైవర్,
షాపుల్లో పనిచేసే ఉద్యోగుల పేర్లతో కొన్ని వైన్స్ ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఈ
అవినీతి, బినామీ వ్యవహారాలపై ఏసీబీతో పూర్తి స్థాయి విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
0 comments:
Post a Comment