హైదరాబాద్:
అధికార కాంగ్రెసు పార్టీ త్వరలో జరగనున్న ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా
తీసుకుంటున్న కీలకమైన సమయంలో కడప జిల్లాకు చెందిన
ఇద్దరు సీనియర్ నేతలు పార్టీకి దూరమవుతున్నారా?
ఆనే ఆసక్తికర చర్చ కాంగ్రెసు పార్టీలో
జరుగుతోందట. రాజ్యసభ సభ్యత్వం ఆశించి భంగపడిన వైయస్ వివేకానంద రెడ్డి,
స్థానిక రాజకీయాల పట్ల అసంతృప్తితో ఉన్న
మాజీ కేంద్ర మంత్రి సాయి ప్రతాప్ క్రమంగా
కాంగ్రెస్ నుంచి వైదొలగే అవకాశాలు
కనిపిస్తున్నాయని పార్టీలోని కొందరు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
దివంగత
ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని,
ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపి వైయస్
జగన్మోహన్ రెడ్డిని వేర్వేరుగా చూడలేమంటూ పలువురు కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై
సాయి ప్రతాప్, వైయస్ వివేకా తీవ్ర
ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
వైయస్ను అవినీతిపరుడంటే సహించేది
లేదంటూ వివేకానంద రెడ్డి తీవ్రస్థాయిలో హెచ్చరించారు. సాయి ప్రతాప్ కూడా
అదేస్థాయిలో స్పందించారు.
ఉప ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కడప జిల్లాకు నిధుల
మంజూరులో చూపుతున్న అలసత్వం, పులివెందుల నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోవడంపై వివేకానంద రెడ్డి యాత్రను నిర్వహించాలని నిర్ణయించడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు
విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. సాధారణంగా బహిరంగ వ్యాఖ్యలకు దూరంగా ఉండే సాయి ప్రతాప్
ఇటీవల తన అభిప్రాయాలను బాహాటంగా
వెల్లడించడానికి పలు కారణాలు ఉన్నాయన్న
అభిప్రాయం వ్యక్తమవుతోంది.
2014 సార్వత్రిక
ఎన్నికల్లో సాయి ప్రతాప్కు
లోక్సభ టికెట్ దక్కకుండా
పార్టీ ముఖ్య నేత ఒకరు
ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇది కూడా సాయి
ప్రతాప్ ఆగ్రహానికి కారణమని అంటున్నారు. అయితే మరోవైపు వివేకా,
సాయిప్రతాప్ మాత్రం తాము కాంగ్రెస్లోనే
కొనసాగుతామని చెబుతుండడం గమనార్హం.
0 comments:
Post a Comment