అనంతపురం:
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని
పని కట్టుకొని మరీ తిట్టాలని సమన్వయ
కమిటీ సమావేశంలో నిర్ణయించలేదని కాంగ్రెసు పార్టీ అనంతపురం జిల్లా సీనియర్ నేత, మాజీ మంత్రి
జెసి దివాకర్ రెడ్డి సోమవారం అన్నారు. ఆయన తాడిపత్రిలో విలేకరులతో
మాట్లాడారు.
వైయస్
రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన పనుల్లో మంచిని మంచిగా, చెడును చెడుగా ప్రజలకు వివరించాలని మాత్రమే తాము సమన్వయ కమిటీ
సమావేశంలో నిర్ణయించారని ఆయన చెప్పారు. పార్టీలో
తన కంటే మేథావులు ఎంతో
మంది ఉన్నారని, తాను వెళ్లినా వెళ్లక
పోయినా నష్టమేమీ ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు.
కాగా
రెండు రోజుల క్రితం జరిగిన
సమన్వయ కమిటీ భేటీలో వైయస్సార్
కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డిని ధీటుగా ఎదుర్కోవాలంటే వైయస్ రాజశేఖర రెడ్డిని
పక్కన పెట్టాలనే నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. పలువురు
నేతలు ఏకంగా వైయస్ను
టార్గెట్ కూడా చేశారు.
అయితే
వైయస్ ను టార్గెట్ చేస్తే
అప్పటి మంత్రి వర్గానిది కూడా బాధ్యత అంటారని
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి,
ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స
సత్యనారాయణ నేతలకు సూచించారు. దీంతో వైయస్ను
విమర్శించే అంశాన్ని పక్కన పెట్టారు. తాజాగా
వైయస్ ఫోటోను కూడా సిఎల్పీ కార్యాలయం
నుండి తీసి వేయాలని పార్టీలోని
కొందరు పెద్దలను కోరుతున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
0 comments:
Post a Comment