హైదరాబాద్:
ఉప ఎన్నికల ఫలితాలను బట్టి కాంగ్రెసు పార్టీ
తెలంగాణపై నిర్ణయం తీసుకుంటుందనే మీడియా కథనాలను ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా
శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం
ఖండించారు. తెలంగాణకు, ఉప ఎన్నికలకు ఎలాంటి
సంబంధం లేదని ఆయన స్పష్టం
చేశారు. తెలంగాణపై అధిష్టానం సరైన సమయంలో సరైన
నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.
ఉప ఎన్నికలలో అభివృద్ధి, సంక్షేమమే మా నినాదం అని
ఆయన చెప్పారు. నాలుగైదు రోజుల్లో అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను
ప్రకటిస్తామని ఆయన చెప్పారు. అభ్యర్థుల
పేర్లను పార్టీ అధిష్టానానికి పంపించి ఆ తర్వాత ప్రకటిస్తామని
చెప్పారు. పార్లమెంటులో తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు సందర్భాన్ని బట్టి అలా వ్యవహరించారని
చెప్పారు.
తెలంగాణకు
ఉప ఎన్నికలకు లింక్ పెడుతూ పత్రికలలో
వచ్చే వార్తలు అవాస్తవమన్నారు. ఉప ఎన్నికలలో గెలుపోటములకు
అందరం సమిష్టి బాధ్యత వహిస్తామని బొత్స చెప్పారు. ఆళ్లగడ్డలో
గంగుల ప్రతాప్ రెడ్డి తాను పోటీ చేయడం
లేదని ఎక్కడా చెప్పలేదన్నారు. అవన్నీ వట్టి పుకార్లే అన్నారు.
ఉప ఎన్నికల ప్రచారంలో పార్టీ సీనియర్లంతా పాల్గొంటారని చెప్పారు. ప్రజలు కాంగ్రెసు పార్టీకి ఖచ్చితంగా పట్టం కడతారని చెప్పారు.
తెలుగుదేశంకు
ఓటేస్తే అది మురిగిపోయినట్లేనని అన్నారు. టిడిపికి
ఎందుకు ఓటు వేయాలని ఆయన
ప్రశ్నించారు. కాగా త్వరలో పద్దెనిమిది
అసెంబ్లీ, ఒక పార్లమెంటు స్థానాలకు
ఉప ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఆ
ఎన్నికల ఫలితాలను బట్టి కాంగ్రెసు పార్టీ
అధిష్టానం తెలంగాణపై ఓ నిర్ణయం తీసుకుంటుందనే
వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ
వార్తలపై బొత్స స్పందించారు.
0 comments:
Post a Comment