హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్
జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేస్తారని జరుగుతున్న ప్రచారంపై తాను మాట్లాడదలుచుకోలేదని జగతి
పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయసాయి రెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం బెయిల్ మీద జైలు నుంచి
విడుదలైన ఆయన శనివారం వైయస్ జగన్తో సమావేశమయ్యారు. ఆ తర్వాత ఆయన
ప్రముఖ తెలుగు టీవీ
చానెల్ ఎన్టీవికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. కేసును ఎలా ముందుకు తీసుకుని వెళ్లాలనే విషయంపై తాను
జగన్తో మాట్లాడినట్లు ఆయన తెలిపారు.
వైయస్ జగన్ ఆస్తుల కేసు నుంచి తామంతా నిర్దోషులుగా బయటకు వస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. జైలులో ఉన్న
103 రోజుల పాటు తాను
న్యాయపరమైన పుస్తకాలు చదవడానికి ప్రాధాన్యం ఇచ్చినట్టు ఆయన
తెలిపారు. కేసు నుంచి
నిర్దోషులుగా బయటకు రావడానికి అవసరమవుతాయనే ఉద్దేశంతో తాను
ఎక్కువగా ఆ పుస్తకాలు చదివినట్లు ఆయన తెలిాపరు. బెయిల్ రావడం నిజంగానే సంతోషకరమైన విషయమని ఆయన
అన్నారు.
బెయిల్ రావడం వల్ల
మీడియా ప్రతినిధులను, బంధువులను, మిత్రులను కలుసుకోవడానికి వీలు
కలిగిందని ఆయన అన్నారు. జైలు జీవితం సంతోషకరంగా ఏమీ ఉండదని, జైలులో ఉండాల్సి రావడం దురదృష్టకరమని ఆయన అన్నారు. చిరు
గాలికి రెపరెపలాడుతున్న దీపంలా న్యాయవ్యవస్థ ఉందని, న్యాయాన్ని, ధర్మాన్ని న్యాయవ్యవస్థ పరిరక్షిస్తోంది కాబట్టే ప్రజాస్వామ్యం నిలబడి ఉందని ఆయన అన్నారు. కేసు పూర్వపరాల గురించి మీడియాతో మాట్లాడదలుచుకోలేదని ఆయన
చెప్పారు. కేసు కోర్టులో ఉన్నందున ఆ విషయం
మాట్లాడడం సరి కాదని
ఆయన అన్నారు.
వైయస్ జగన్పై సిబిఐ దర్యాప్తు వెనక రాజకీయ కారణాలున్నాయనే విషయంపై మాట్లాడడానికి ఆయన
నిరాకరించారు. జగన్ గ్రూపు సంస్థలు, కుటుంబం ఆడిటర్గా తాను తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నానని, ఇక ముందు నిర్వహిస్తానని ఆయన చెప్పారు. ఆడిటర్గా జగన్తో మాట్లాడినట్లు ఆయన
తెలిపారు. ఈ కేసులో గానీ మరో కేసులో గానీ తమ హక్కులకు భంగం కలిగినట్లు భావిస్తే న్యాయపోరాటం చేస్తామని ఆయన
చెప్పారు.
అరెస్టుకు ముందు గానీ
అరెస్టు తర్వాత గానీ
తాను ఆత్మస్థయిర్యం కోల్పోలేదని ఆయన చెప్పారు. సిబిఐ
ముందు తనకు ఏ విధమైన ఆరోపణలు లేవని ఆయన చెప్పారు. సిబిఐ నిర్వహించాల్సిన బాధ్యతను సిబిఐ నిర్వహిస్తోందని ఆయన
చెప్పారు. ఆడిటర్గా జగన్ గ్రూపు సంస్థలకు, కుటుంబానికి తాను
చేయాల్సింది చేస్తానని ఆయన
చెప్పారు.
0 comments:
Post a Comment