హైదరాబాద్:
మంగళి కృష్ణ వైయస్సార్ కాంగ్రెసు
పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డికి ప్రధాన అనుచరుడని తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి
గాలి ముద్దుకృష్ణమ నాయుడు బుధవారం ఆరోపించారు. ఆయన తెలుగుదేశం పార్టీ
కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మంగళి కృష్ణను అరెస్టు
చేస్తే జగన్ ఓ రోజంతా
అతని కోసం పులివెందులలో పోలీసు
స్టేషన్ ఎదుట ధర్నా చేయడమే
కృష్ణ ఆయన అనుచరుడు అనేందుకు
మంచి నిదర్శనమన్నారు.
దివంగత
ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి,
వైయస్ జగన్మోహన్ రెడ్డి చేయించిన హత్యల వెనుక మంగలి
కృష్ణ ఉన్నారని విమర్శించారు. ఆ హత్యలన్నింటికీ ఆయుధాలు
సరఫరా చేసింది మంగళి కృష్ణేనని ఆరోపించారు.
జగన్కు కృష్ణ బ్యాక్
బోన్ అన్నారు. వైయస్, జగన్ కుటుంబ అరాచకాలను
కృష్ణ నడిపించారని మండిపడ్డారు.
వైయస్
జగన్మోహన్ రెడ్డి ఆక్రమ ఆస్తుల కేసులో
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ)
రెండుసార్లు ఛార్జీషీటు దాఖలు చేసినా జగన్ను ఎందుకు అరెస్టు
చేయలేదని ప్రశ్నించారు. ఈ కేసులో ఆయన
ఎ-1గా ఉన్నాడన్నారు. మద్యం
సిండికేట్లలో హోలోగ్రామ్ స్టిక్కర్ల అంశంలో ఎక్సైజ్ శాఖ మంత్రి మోపిదేవి
వెంకట రమణ చక్రం తిప్పారని
ఆరోపించారు.
మళ్లీ
టెండర్లు పిలిచి వారికే కట్టబెట్టే అవకాశముందని ఆయన ఆరోపించారు. ప్రైస్
బిడ్ తెరవకుండా మోపిదేవి అడ్డుకున్నారని విమర్శించారు. మద్యం సిండికేట్ల విషయంలో
ప్రభుత్వం అధికారులను అరెస్టు చేస్తూ మంత్రులను మాత్రం మినహాయిస్తోందని విమర్శించారు. సంబంధమున్న మంత్రులపై చర్యలు తీసుకోవాలని గాలి ముఖ్యమంత్రి కిరణ్
కుమార్ రెడ్డిని డిమాండ్ చేశారు.
మద్దెలచెర్వు
సూరి హత్య కేసులో ప్రధాన
నిందితుడు భాను కిరణ్, మంగళి
కృష్ణ ఇద్దరూ జగన్కు బినామీలని
శాసనమండలి సభ్యుడు రాజేంద్ర ప్రసాద్ ఆరోపించారు. దందాలు చేసే వాళ్లను పార్టీలో
కొనసాగించడం జగన్, ఆయన పార్టీ
విశ్వసనీయతా అని ప్రశ్నంచారు.
మహానాడు
యథాతథంగా ఉంటుందని రాజేంద్ర ప్రసాద్, నర్సారెడ్డిలు చెప్పారు. జగన్ అధికారంలోకి వస్తే
దొంగల పాలన, హంతకుల యుగం
వస్తుందన్నారు. రాష్ట్రంలోని మాఫియాకు మూల కారణం దివంగత
వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబమేనని ఆయన ఆరోపించారు.
0 comments:
Post a Comment