వైయస్సార్
కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వ్యవహారాల
విషయంలో కాంగ్రెసు అధిష్టానం దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకున్నట్లు చెబుతున్నారు. వైయస్ జగన్ ఆస్తుల
కేసులో సిబిఐ దూకుడుగా ముందుకు
వెళ్తోంది. సిబిఐ దూకుడుగా వెళ్లడం
వైయస్ జగన్పై ప్రజల్లో
సానుభూతి పెరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనివల్ల జూన్ 12వ తేదీన జరిగే
ఉప ఎన్నికల్లో జగన్కు ప్రయోజనం
చేకూరుతుందనే అంచనాలు సాగుతున్నాయి.
రాష్ట్రంలోని
18 శాసనసభా స్థానాలకు, ఓ లోకసభ స్థానానికి
ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో జగన్పై సిబిఐ
చర్యల వల్ల కాంగ్రెసుకు నష్టం
కలుగుతుందని అంటున్నారు. జగన్కు చెందిన
మీడియా సంస్థల బ్యాంక్ ఖాతాలను సిబిఐ స్తంభింపజేసింది. జగన్
ఆస్తుల కేసులో పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, ప్రభుత్వాధికారి బ్రహ్మానందరెడ్డిలను సిబిఐ అరెస్టు చేసింది.
జగన్ మీడియా సంస్థల ఆస్తులను జప్తు చేసేందుకు కూడా
సిబిఐ ఏర్పాట్లు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
సిబిఐ
దూకుడు నేపథ్యంలో వైయస్ జగన్పై
ప్రజల్లో సానుభూతి పెరుగుతుందని అంటున్నారు. అయితే, దాని వల్ల ఉప
ఎన్నికల్లో తమకు వ్యతిరేకంగా ఫలితాలు
వచ్చినా భవిష్యత్తులో నష్టాన్ని నివారించుకోవడానికి వీలవుతుందని కాంగ్రెసు అధిష్టానం ఆలోచిస్తున్నట్లు సమాచారం. జగన్పై చర్యలు
తీసుకోకపోతే ఉప ఎన్నికల్లో వైయస్సార్
కాంగ్రెసు పార్టీ విజయం సాధిస్తే సంభవించే
పరిణామాలను నియంత్రించడం సాధ్యం కాదనే అబిప్రాయానికి కాంగ్రెసు
అధిష్టానం వచ్చినట్లు చెబుతున్నారు.
భవిష్యత్తు
పరిణామాలను తమ చేతుల్లోకి తీసుకోవడానికి,
2014 సాధారణ ఎన్నికలకు పునాదులు సరిచేసుకోవడానికి వైయస్ జగన్పై
ఇప్పుడు చర్యలు తీసుకుంటేనే వీలవుతుందనే అంచనాలో ఉన్నట్లు తెలుస్తోంది. ఉప ఎన్నికల్లో ఏదో
మేరకు ఫలితాలను సాధించాలనే పట్టుదలతో కూడా కాంగ్రెసు అధిష్టానం
ఉన్నట్లు అర్థమవుతోంది.
ఎన్నికల
ప్రచారంలోకి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని,
పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను మాత్రమే
కాకుండా చిరంజీవిని కూడా దించింది. చిరంజీవి
ప్రచార కార్యక్రమాన్ని అధిష్టానం రూపొందించి ఆయనకు తగిన సూచనలు
చేస్తున్నట్లు చెబుతున్నారు. అదే సమయంలో అధిష్టానానికి
చెందిన వాయలార్ రవి, కెబి కృష్ణమూర్తి
ఎవరో ఒకరు రాష్ట్రంలో ఉంటూ
పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తగిన కార్యాచరణను రూపొందిస్తున్నారు.
0 comments:
Post a Comment