హైదరాబాద్:
మద్దెలచెర్వు సూరి హత్య కేసులో
ప్రధాన నిందితుడు భాను కిరణ్తో
కలిసి సినీ దర్శకుడు తేజ
తనను బెదిరించాడని సినీ నిర్మాత చదలవాడ
శ్రీనివాస రావు రాష్ట్ర నేర
పరిశోధన విభాగం (సిఐడి) అధికారులకు పిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన
బుధవారం సిఐడి అధికారులను కలిసి
అందుకు అవసరమైన వివరాలను అందజేశారు. రౌడీలతో ఇంటి వివాదంలో తేజ
తనను బెదిరించాడని, వారంతా భాను మనుషులని చదలవాడ
శ్రీనివాస రావు ఫిర్యాదు చేశారు.
మరో తెలుగు సినీ నిర్మాత నట్టి
కుమార్ కూడా సిఐడి దర్యాప్తు
అధికారుల ముందు బుధవారం హాజరయ్యారు.నిర్మాతలు సి. కళ్యాణ్, సింగనమల
రమేష్లతో కలిసి ఓ
అగ్ర దర్శకుడు సెటిల్మెంట్ డబ్బుతో అగ్ర హీరోతో సినిమా
నిర్మించారని నట్టి కుమార్ సిఐడి
అధికారులకు చెప్పినట్లు సమాచారం. ఓ వివాదాస్పద భూమిని
అడ్డం పెట్టుకుని ఈ సినిమాను నిర్మించారని
ఆయన ఆరోపించారు. నట్టి కుమార్కు,
సి. కళ్యాణ్కు మధ్య వివాదం
నడుస్తున్న విషయం తెలిసిందే.
విశాఖపట్నంలోని
ఓ భూవివాదం సెటిల్మెంట్ చేసి, డబ్బుతో సినిమా
నిర్మించారని నట్టి కుమార్ చెప్పినట్లు
సమాచారం. భాను కిరణ్ సినీ
దందాలపై సిఐడి అధికారులు దృష్టి
పెట్టారు. భూముల సెటిల్మెంట్లు, సినీ
పరిశ్రమతో సంబంధాల వంటి అన్ని విషయాలపై
సిఐడి అధికారులు ఆరా తీస్తున్నారు.
ఇదిలా
వుంటే, భాను కిరణ్పై
మరో కేసు నమోదైంది. హంద్రీనీవా
ప్రాజెక్టులో సబ్ కాంట్రాక్టర్ వెంకట
నర్సింహారెడ్డిని భాను కిరణ్ బెదిరించి
రూ. 12 కోట్లు చెక్కుల రూపంలో తీసుకున్నట్లు సిఐడికి ఫిర్యాదు అందింది. 2008 డిసెంబర్లో డబ్బులు చెల్లించిన
చెక్కుల వివరాలను బాధితులు సిఐడికి అందించారు. దీంతో భానుపై మరో
కేసు నమైదైంది.
0 comments:
Post a Comment