హైదరాబాద్:
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి,
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ అపూర్వ సహోదరులు అని తెలుగుదేశం పార్టీ
అధికార ప్రతినిధి, కొడంగల్ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి గురువారం అన్నారు. జగన్కు కిరణ్
కుమార్ రెడ్డి పెద్ద కోవర్టు అని
ఆరోపించారు. కాంగ్రెసు ప్రభుత్వాన్ని, జగన్ను వేరుగా
చూడలేమన్నారు. జగన్ పైన చర్యలు
తీసుకునేందుకు కిరణ్కు ధైర్యం
చాలడం లేదని చెప్పారు.
గుంటూరు,
ప్రకాశం జిల్లాలలో వాన్పిక్కు
కేటాయించిన భూమిని ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలని దూళిపాళ్ల నరేంద్ర అన్నారు. ప్రజల సంపదను దోపిడీ
చేసి జగన్ తన మీడియాలోకి
మళ్లించారని ఆరోపించారు. వాన్పిక్ చట్టబద్దం
కాదని తెలుగుదేశం పార్టీ ఎప్పుడో చెప్పిందన్నారు. దోపిడీ చేసేందుకు ఎన్ని మార్గాలు ఉన్నాయో
అన్ని మార్గాలను జగన్ తన స్వార్థం
కోసం ఉపయోగించుకున్నాడని మండిపడ్డారు. ఆంధ్రజ్యోతి కథనాలు అక్షర సత్యాలు అన్నారు.
మరోవైపు
వాన్పిక్కు కేటాయించిన
భూములను వెంటనే రద్దు చేయాలని ముఖ్యమంత్రి
కిరణ్ కుమార్ రెడ్డికి మంత్రి మాణిక్య వర ప్రసాద్ లేఖ
రాశారు. వాన్పిక్‌లో
అక్రమాలు జరిగాయని ఆయన లేఖలో పేర్కొన్నారు.
దీని వల్ల రెండు జిల్లాలలో
వేలాది పేద కుటుంబాలు రోడ్డున
పడ్డాయన్నారు. వెంటనే రద్దు చేయాలన్నారు.
తప్పు
చేసిన వారు ఎంతటి వారైనా
విచారించాలన్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని
చెప్పారు. ఇందుకు సంబంధించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. వాన్పిక్‌కు
కేటాయించిన భూములను రద్దు చేయాలని ఎప్పుడో
చెప్పామన్నారు. తప్పు చేస్తే ఎంతటి
వారి పైన అయినా చర్యలు
తీసుకోవాలన్నారు.
0 comments:
Post a Comment