‘అధినాయకుడు’
తర్వాత నందమూరి నటసింహం బాలయ్య
నటిస్తున్న చిత్రం ‘శ్రీమన్నారాయణ’. రవి చావాలి దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని
రమేష్ పుప్పాల నిర్మిస్తున్నారు. పార్వతి మెల్టన్, ఇషా చావ్లాలను హీరోయిన్లు. ఇటీవలే
బాలయ్య, ఇషా చావ్లా, పార్వతి మెల్టన్‌లపై ఓపాటను చిత్రీకరించారు.
ప్రస్తుతం హైదరాబాద్
శివారులోని అల్యూమినియం ఫ్యాక్టరీలో పలు యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.
యూనిట్ సభ్యుల నుంచి అందిన సమాచారం ప్రకారం విలన్ ఇక్కడికి రమ్మని బాలయ్యకు సవాల్ విసురుతాడని,
ఈ నేపథ్యంలో అక్కడ ఫైట్ సీన్ ఉంటుందని, దాన్నే ఇక్కడ చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో బాలయ్య
విలన్‌పైకి కొన్ని పంచ్ డైలాగులు వదులుతాడు. అవి క్రింవిధంగా ఉన్నాయి.
ఏ అడ్డాకైనా
నేనే రెడీ... కడప సెవెన్ రోడ్స్ సెంటర్‌కి రానా, అనంతపూర్ సప్తగిరి సర్కిల్‌కి రానా,
లేకుంటే కర్నూలు కొండారెడ్డి బురుజు ఓకేనా...లేక విజయవాడ బెంజ్ సర్కిల్ ఓకేనా...లేక
పోతే కరీంనగర్ కమాన్‌కి రానా.. ఏబే బోల్..! ఎక్కడికి వచ్చినా ఓ బనేగా షేర్‌కి అడ్డా!
కాగా.....బాలయ్య
నటించిన ‘అధినాయకుడు’ చిత్రం విడుదలవ్వాల్సి ఉంది. బాలయ్య ఈ
చిత్రంలో మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నాడు. అయితే ఈచిత్రం నెలలోనే విడుదల
కావాల్సి ఉన్నా, ఆర్థిక పరమైన ఇబ్బందుల వల్ల విడుదల ఆలస్యం అవుతోంది.
0 comments:
Post a Comment