సూపర్
స్టార్ మహేష్ బాబు, హీరోయిన్
సమంత పెళ్లి చేసుకోబోతున్నారు. కొంపతీసి ఇది రియల్ లైఫ్లో అనుకునేరు....అస్సలు
కాదు, రీల్ లైఫ్లో
వీరి పెళ్లి జరుగుతోంది. ప్రస్తుతం వీరిద్దరు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. షూటింగులో
భాగంగా ప్రస్తుతం వీరిద్దరు పెళ్లి చేసుకునే సీన్లు చిత్రీకరిస్తున్నారు.
ఇటీవలే
త్రివిక్రమ్ దర్శకత్వంలో జోస్ అలుకాస్ కంపెనీ
ప్రచారంలో భాగంగా యాడ్ ఫిల్మ్ షూటింగు
పూర్తి చేసుకున్న మహేష్ బాబు....తాజాగా
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ షూటింగులో జాయిన్ అయ్యారు. రామోజీ ఫిల్మ్ సిటీలో రూ. 2 కోట్లతో వేసిన
సెట్లో షూటింగు జరుగుతోంది.
మెయిన్ కాస్ట్ సమక్షంలో మహేష్, సమంత పెళ్లి సీన్లు
షూట్ చేస్తున్నారు.
శ్రీకాంత్
అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీవెంకటేశ్వర
క్రియేషన్స్ బేనర్పై నిర్మిస్తున్నారు.
విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్
బాబు మల్టీ స్టారర్గా
ఈచిత్రం రూపొందుతోంది. మహేష్ బాబు సరసన
సమంత నటిస్తుండగా, వెంకీ సరసన జర్నీ
ఫేం అంజలి రొమాన్స్ చేస్తోంది.
పూర్తి
కుటుంబ కథా చిత్రం రూపొందుతున్న
ఈచిత్రం మహేష్ బాబు గత
సినిమాలకు భిన్నంగా... మాస్, క్లాస్, ఫ్యామిలీ,
యూత్ ఆడియన్స్ను మెప్పించేలా అన్ని
చిత్రీకరిస్తున్నారు. దసరా నాటికి ఈచిత్రం
ప్రేక్షుకుల తెచ్చేందుకు దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు.
0 comments:
Post a Comment