గబ్బర్
సింగ్ చిత్రంలోని ‘కెవ్వు కేక’ సాంగ్ ఆడియోలో ఉన్న
ఊపు...చిత్రీకరణలో లేదని విమర్శలు వినిపిస్తున్న
సంగతి తెలిసిందే. ఆ పాటకోసం మలైకా
అరోరాకి కోటి రూపాయల రెమ్యూనరేషన్
ఇవ్వడం దండగ అని పలువురు
విమర్శిస్తున్నారు కూడా. సాంగు సంగ
భాగం పేలవంగా చిత్రీకరించారని, పవర్ స్టార్ ఎంట్రీ
ఇచ్చిన తర్వాతే కేక మొదలైందని ప్రేక్షకులు
కూడా తమ అభిప్రాయం వ్యక్తం
చేశారు.
తాజాగా
స్టార్ దర్శకుడు రాజమౌళి కూడా...కెవ్వుకేక పాటపై పెదవి విరిచారు.
నిన్న ఐమాక్స్ థియేటర్లో ‘గబ్బర్ సింగ్’ చిత్రాన్ని చూసిన ఆయన సినిమా
బాగుందని, హరీష్ శంకర్ తన
టాలెంట్ చాటారని ట్వీట్ చేశారు. అయితే కెవ్వుకేక పాట
చిత్రీకరణ తనను డిస్సపాయింట్ చేసిందని,
అనుకున్న రేంజిలో లేని పేర్కొన్నారు.
రాజమౌళి
చెప్పిన దాంట్లో వాస్తవం ఉందని, దర్శకుడు ఆ పాట చిత్రీకరణపై
మరింత దృష్ట పెడితే బాగుండేదని
ఇటు ప్రేక్షకులు కూడా అభిప్రాయ పడుతున్నారు.
ఏది ఏమైనా హరీష్ శంకర్
తన భవిష్యత్ సినిమాల్లో అయినా ఐటం సాంగులపై
మరింత శ్రద్ధ వహిస్తే మంచిదని అంటున్నారు.
పవన్
కళ్యాణ్ సరసన శృతి హాసన్
నటించగా.... మలైకా అరోరా, అభిమన్యు
సింగ్, కోట శ్రీనివాసరావు, సుహాసిని,
బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అజయ్, నాగినీడు,
రావు రమేష్, గిరి, ఫిష్ వెంకట్,
ప్రభాస్ శ్రీను, అలీ, సత్యం రాజేష్,
మాస్టర్ ఆకాష్, మాస్టర్ నాగన్, ప్రవీణ్, మర్ల శ్రీను, కాభీభట్ల
ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ఫోటో
గ్రఫీ : జైనన్ విన్సెంట్, సంగీతం
: దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్ : బ్రహ్మ కడలి, ఎడిటింగ్ : గౌతం
రాజు, స్ర్కీన్ ప్లే : రమేష్ రెడ్డి, వేగేశ్న
సతీష్, డాన్స్ : దినేష్, గణేష్, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ప్రొడక్షన్
కంట్రోలర్ : డి. బ్రహ్మానందం, సమర్పణ
: శివబాబు బండ్ల, నిర్మాత : బండ్ల గణేష్, స్క్రీప్లే,
మాటలు, దర్శకత్వం : హరీష్ శంకర్
0 comments:
Post a Comment