బాలకృష్ణ
హీరోగా నటించిన ‘అధినాయకుడు’ చిత్రం ఈ రోజు భారీ
ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ
చిత్రంలో బాలకృష్ణ తాతగా,తండ్రి గా,మనవడుగా మూడు విభిన్నమైన పాత్రలు
పోషిస్తున్నారు. ఈ పాత్రల్లో పెద్దాయన(తాత)పాత్ర పరిటాల
శ్రీరాములును గుర్తు చేస్తుంటే,తండ్రి పాత్ర పరిటాల రవిని
జ్ఠప్తికి తెస్తోందని అంటున్నారు. అందులోనూ ఆ పాత్ర నక్సలైట్
గా మారి అడవుల్లోకి వెళ్ళటం,ఒక సిద్దాంతం కోసం
కట్టుపడి పనిచేయటం రవిని దృష్టిలో పెట్టుకుని
చేసారని చెప్పుకుంటున్నారు. ఇక మూడో పాత్ర
మనవడు..రెగ్యులర్ కమర్షియల్ ఫార్మెట్ లో చేసారు.
ఇక ఈ చిత్రం ఇప్పటికే
అనేకసార్లు విడుదల తేదీ వాయిదాపడిన ఈ
చిత్రం పలు సమస్యలతో కొట్టుమిట్టాడిన
సంగతి తెలిసిందే. ఆర్థిక లావాదేవీలు, షూటింగ్ సరిగా జరగకపోవడం ఈ
చిత్రానికి అనేక ఇబ్బందులు కలిగించింది.
ప్రేక్షకులు ఈ చిత్రంకోసం ముఖ్యంగా
బాలకృష్ణ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. చివరికి వారి కల ఫలించి
చిత్రం విడుదల కానుంది. బాలకృష్ణ త్రిపాత్రాభినయంతో శ్రీ కీర్తి కంబైన్స్
పతాకంపై నిర్మితమైన చిత్రం అధినాయకుడు. పరుచూరి మురళి దర్శకత్వంలో ఎం.ఎల్.పద్మకుమారి చౌదరి
ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్ని హంగులు పూర్తిచేసుకుని
ఈ రోజు (జూన్ 1)న
విడుదలైంది.
పరుచూరి
మురళి దర్శకత్వంలో ఎమ్.ఎల్ కుమార్చౌదరి ఈ నిర్మించారు.బాలకృష్ణ ఇందులో తొలిసారి త్రిపాత్రాభినయం చేసారు.‘అధినాయకుడు’ చిత్రాన్ని కీర్తి కంబైన్స్ పతాకంపై ఎమ్మెల్ కుమార్ చౌదరి నిర్మిస్తు న్నారు.
ఈ చిత్రంలో లక్ష్మీరాయ్, చార్మి, సలోని హీరోయిన్లుగా నటిస్తున్నారు.
కళ్యాణి మాలిక్ కంపోజ్ చేసిన అన్ని పాటలు
చాలా అద్భుతంగా వచ్చా యి. శ్రీరామ
రాజ్యం వంటి భక్తి రసాత్మక
చిత్రం తర్వాత ఔట్ అండ్ ఔట్
కమర్షియల్ మూవీగా ‘అధినాయకుడు’ వచ్చింది.
దర్శకుడు
పరుచూరి మురళి ఈ చిత్రం
గురించి మాట్లాడుతూ ..“ ప్రజలకు సేవ చేసే నిజమైన
నేత, వారి కష్ట సుఖాలలో
పాలు పంచుకునే నేత ఎలా ఉండాలో
అధినాయకుడు చూపిస్తుందని చెప్పిన మాటలు కూడా మరింత
ఆసక్తి పెంచుతున్నాయి. ఇక ఈ సినిమాలో
బాలయ్య సరసన హీరోయిన్లుగా సలోని,
లక్ష్మి రాయ్ నటిస్తున్నారు. గతంలో
చెన్నవకేశవరెడ్డి, ఒక్క మగాడు చిత్రాల్లో
ఓల్డేజ్ గెటప్ లో కనిపించిన
బాలయ్య అధినాయకుడులో మరోసారి ఆ క్యారెక్టర్ చేసారు.
తాతగా,
తండ్రిగా, తనయుడిగా ఒకదానితో ఒకటి పొంతనలేని పాత్రల్లో
ఆయన కనిపిస్తారు. జయసుధ, సలోని, లక్ష్మీరాయ్ ఆ మూడు పాత్రలకు
జోడీలుగా నటిస్తున్నారు. కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం,
చరణ్రాజ్, ఎమ్మెస్నారాయణ,
వేణుమాధవ్, ఆదిత్యమీనన్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న
ఈ చిత్రానికి ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, సమర్పణ: సందీప్.
0 comments:
Post a Comment