నందమూరి
హీరో బాలకృష్ణ నటించిన అధినాయకుడు చిత్రం ఈ రోజు విడుదలైంది.
ఎన్నో అంచనాలతో వచ్చిన ఈచిత్రం అనుకున్న అంచనాలు చేరుకోలేక పోయిందనే చెప్పాలి. పొలిటికల్ ఫ్లేవర్ ఉన్నట్లు కనిపించినా ఈ చిత్రంలో అలాంటిదేమీ
లేదు. కేవలం ప్రేక్షకులను థియేటర్లకు
లాగడానికే ట్రైలర్లలో అలాంటి మాయ చేశారు. జగన్,
చిరంజీవి ప్రస్తావన ఉందని ఆశించి వెళితే
దగా పడకతప్పదు.
కథలోకి
వెళితే....
హరిశ్చంధ్రప్రసాద్(బాలకృష్ణ) రాయలసీమలో మంచి పేరున్న నాయకుడు.
పండు ముసలాయన. హరిశ్చంద్రప్రసాద్ తనయుడు రామకృష్ణ ప్రసాద్. సాధారణంగా ఫాక్షన్ సినిమాల్లో మాదిరే....ఇలాంటి మంచి నాయకులు ఉన్న
చోట వాళ్లంటే పడని కొందరు చెడ్డవాళ్లు
కూడా ఉంటారు. ఈ చిత్రంలోనూ అంతే.
అతన్ని చంపడానికి ప్లాన్ వేసిన కోట శ్రీనివాసరావు,
ప్రదీప్ రావత్ రెండేళ్ల వయసులో
ఉన్న అతని మనవడు కిట్టు(బాలకృష్ణ)ను కిడ్నాప్ చేసి
అనాధగా పెంచి నేరస్తుడిగా తయారు
చేస్తారు. అతనికి పదేళ్లు వచ్చిన తర్వాత కిట్టుతోనే హరిశ్చంద్రప్రసాద్ను చంపిస్తారు.
అలా అలా అనాదగానే పెరిగిన
కిట్టు ముంబైలో ప్రొఫెషనల్ కిల్లర్గా మారుతాడు. కొన్ని
రోజుల కొట్టు తండ్రి రామకృష్ణ ప్రసాద్ని కూడా కిల్లర్
కిట్టుతోనే చంపించాలని చూస్తారు. కానీ విషయం గ్రహించి
కిట్టు తనకో కుటుంబం ఉందని,
రామకృష్ణ ప్రసాద్ తన తండ్రే అనే
విషయం తెలుసుకుని కుటుంబానికి దగ్గరవుతాడు.
దీంతో
ఇరకాటంలో పడ్డ విలన్లు కోట,
ప్రదీప్ రావత్........హరిశ్చంద్ర ప్రసాద్ను చంపింది కిల్లర్
కిట్టు అనే విషయం బయట
పెడతారు. ఆతర్వాత కథ ఎలాంటి మలుపులు
తిరిగిందనేది సినిమా తర్వాతి స్టోరీ. లక్ష్మి రాయ్ దీప పాత్రలో
కిట్టు మరదలిగా నటించింది. సలోని ఓ కల్పిత
ఫ్లాష్ బ్యాక్ సాంగులో కనిపిస్తుంది.
0 comments:
Post a Comment