దర్శక
నిర్మాత రామ్ గోపాల్ వర్మను
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ బెదిరించాడని
కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ చేసిన వ్యాఖ్యల వెనక
పెద్ద కథే నడిచిందట. ఇదంతా
దర్శకుడు, తన శిష్యుడు పూరీ
జగన్నాథ్పై వర్మ ఎక్కుపెట్టిన
అస్త్రమని అంటున్నారు. వర్మ, లగడపాటి క్లాస్
మేట్స్, మంచి మిత్రులు కూడా.
ఆ స్నేహాన్ని వర్మ ఇందుకు వాడుకున్నారని
అంటున్నారు. పైగా, ఇద్దరి ప్రయోజనాలు
కూడా అందులో ఇమిడి ఉన్నాయని అంటున్నారు.
రామ్
గోపాల్ వర్మకు సినీ దర్శకుల్లో చాలా
మందే శిష్యులున్నారు. అయితే, వారిలో పూరీ జగన్నాథ్ది
ప్రత్యేక స్థానం. పూరీ జగన్నాథ్ సోదరుడు
ఉమా గణేష్ వైయస్ జగన్
పార్టీలో ఉన్నారు. పైగా, జగన్ జైలుకు
వెళ్లిన తర్వాత ఓ అనూహ్యమైన పరిణామం
చోటు చేసుకుంది. వైయస్ విజయమ్మ, తన
కూతురు షర్మిలతో కలిసి ఉప ఎన్నికల
ప్రచారంలోకి దిగారు. మొదటి రోజు ప్రచారం
ముగించుకున్న తర్వాత వారిద్దరు నర్సీపట్నంలోని పూరీ జగన్నాథ్ నివాసంలో
బస చేశారు.
వారు
తన నివాసంలో బస చేసిన విషయాన్ని
పూరీ జగన్నాథ్ ట్వీట్ చేశాడు. అందుకు తన ట్విట్టర్లో
చాలా ఆనందం వ్యక్తం చేశారు.
వైయస్ జగన్ అంటే అరికాలి
మంట నెత్తికెక్కే వర్మ దానికి ఆగ్రహం
చెందారని అంటారు. పూరీ జగన్నాథ్పై
వర్మకు మండిపోయిందట. దాంతో ఆయన లగడపాటితో
మాట్లాడి వైయస్ జగన్ తనను
బెదిరించినట్లు ప్రకటన చేయించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత దాన్ని
సమర్థిస్తూ వర్మ మీడియా ప్రతినిధులకు
మెసేజ్ పెట్టారు.
రాజకీయాలను,
సినిమాలను వేర్వేరుగా చూసే పూరీ జగన్నాథ్
ఈ పరిణామానికి హడలెత్తిపోయారని అంటారు. వర్మ కోపాన్ని చల్లార్చడానికి
వివియస్ రవిని మధ్యవర్తిగా పంపినట్లు
చెబుతారు. కొసమెరుపు ఏమంటే, వైయస్ రాజశేఖర రెడ్డి
మరణాంతరం ఆయన జీవితంపై పూరీ
జగన్నాథ్ ఓ సినిమా తీస్తానని
ప్రకటించారు. ఏర్పాట్లు కూడా పూర్తయినట్లు అప్పట్లో
వార్తలు వచ్చాయి. అయితే, ఆ తర్వాత దాని
మాటా ముచ్చటే లేదు. నిజానికి, ఏం
జరిగిందో తెలియదు గానీ, తాజా పరిణామంపై
మీడియాలో పలు విధాలుగా ఊహాగానాలతో
కూడిన వార్తలు వస్తున్నాయి.
0 comments:
Post a Comment