సత్యం
కంప్యూటర్స్ మాజీ అధినేత రామలింగ
రాజు కూడా వైయస్సార్ కాంగ్రెసు
పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్కు
చెందిన జగతి పబ్లికేషన్స్లో
20 కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టాడు. వైయస్ జగన్ ఆస్తుల
కేసులో అరెస్టయిన నిమ్మగడ్డ ప్రసాద్ ఇందుకు మధ్యవర్తిగా వ్యవహరించారు. మైటాస్ ఇన్ఫ్రా ద్వారా
రామలింగ రాజు జగన్ కంపెనీలో
ఆ పెట్టుబడులు పెట్టారు. అందుకు ప్రతిఫలంగా మైటాస్కు నామినేషన్ ప్రాతిపదికపై
కడప జిల్లాలో 121 కోట్ల రూపాయల విలువ
చేసే రోడ్డు విస్తరణ ప్రాజెక్టు దక్కింది.
సిబిఐ
దాఖలు చేసిన నిమ్మగడ్డ కస్టడీ
పిటిషన్ విచారణ సందర్భంగా సిబిఐ డిప్యూటీ న్యాయ
సలహాదారు తన వాదనల్లో భాగంగా
ఆ విషయాలు వెల్లడించారు. ఇందు గ్రూపు సంస్థలకు
అనంతపురం జిల్లా లేపాక్షి నాలెడ్జీ హబ్ కోసం వైయస్
రాజశేఖర రెడ్డి ప్రభుత్వం 8,800 ఎకరాల భూమిని కట్టబెట్టింది.
ఇందుకు ప్రతిఫలంగా పారిశ్రామికవేత్త శ్యాంప్రసాద్ రెడ్డికి చెందిన ఇందు గ్రూపునకు చెందిన
వాల్డెన్, కార్నర్ స్టోన్ కంపెనీలు నిమ్మగడ్డ ప్రసాద్ ద్వారా రూ. 70 కోట్లు జనగ్ కంపెనీల్లో పెట్టుబడులు
పెట్టాయి.
వాన్పిక్ ప్రాజెక్టులో ఓడరేవుల
కోసం ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో 2 వేల ఎకరాల చొప్పున
4 వేల ఎకరాలు ప్రభుత్వం లీజుకు అప్పగించాలని నిర్ణయించింది. పారిశ్రామిక కారిడార్ కోసం 24 వేల ఎకరాలను సేకరించి
అప్పగించాల్సి ఉంది. బహిరంగ వేలం
లేకుండా ఈ ప్రాజెక్టును రెండు
ప్రభుత్వాల మధ్య (రస్ అల్ఖైమా, ఆంధ్రప్రదేశ్) మధ్య
కుదిరిన ఒప్పంగం సాకుతో అప్పగించారు. రైతులు, ప్రైవేట్ వ్యక్తుల నుంచి సేకరించాల్సిన భూములకు
కలెక్టర్ నిర్ణయించిన ధర కన్నా ఎక్కువగా
నిమ్మగడ్డ ప్రాసద్ రస్ అల్ ఖైమా
(రాక్) నుంచి వసూలు చేశారు.
నిమ్మగడ్డ
ప్రసాద్తో కలిసి కుట్ర
చేసిన అప్పటి మౌలిక సదుపాయాలు, మౌలిక
సదుపాయాల కల్పన శాఖ ముఖ్య
కార్యదర్శి బ్రహ్మానంద రెడ్డి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒక వేళ ప్రాజెక్టును
అమలు చేయకపోతే భూమిని వెనక్కి తీసుకునే నిబంధనను కూడా చేర్చలేదు. సిబిఐ
తరఫు న్యాయవాది - నిమ్మగడ్డ ప్రసాద్ను, బ్రహ్మానంద రెడ్డిని
సిబిఐ కస్టడీకి అప్పగించాలని కోర్టును కోరిన సందర్భంలో చేసిన
వాదనలు అవి. అయితే, సిబిఐ
వాదనలను నిమ్మగడ్డ ప్రసాద్ తరఫు న్యాయవాది రాజశేఖర
రావు తోసి పుచ్చారు. అభివృద్ధికి
పనిచేయడమే నేరమా అని ఆయన
అడిగారు.
0 comments:
Post a Comment