హైదరాబాద్:
మూత్రపిండాల మార్పిడి రాకెట్ గుట్టును హైదరాబాదు పోలీసులు ఆదివారం రట్టు చేశారు. ఇందుకు
సంబంధించి ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. అవసరం ఉన్నవారికి మూత్రపిండాలు
దానం చేసేవారిని పట్టుకుని వారికి అప్పగించడంలో ప్రభుత్వ వైద్యుడితో వారు కుమ్మక్కయినట్లు, అందుకు
ప్రతిగా డబ్బులు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
వారిద్దరిని
పోలీసులు రాజేంద్రప్రసాద్, వెంకటశ్రీనివాస్లుగా గుర్తించారు. డబ్బులు
అవసరం ఉన్నవారిని పట్టుకుని, వారికి నచ్చజెప్పి, మూత్రపిండాలను దానం చేసేందుకు ఒప్పించి,
వారికి ఐదు లక్షల రూపాయల
వరకు ఆ ఇద్దరు ఇస్తామని
హామి ఇస్తున్నారని పోలీసులు తెలిపారు.
మూత్రపిండాలు
దానం చేయడానికి ముందుకు వచ్చేవారిని ఆ ఇద్దరు కర్ణాటక
ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి
నడుపుతున్న రమేష్ చాడ అనే
వైద్యుడికి అప్పగిస్తూ వస్తున్నారని, అతను వైద్య పరీక్షలు
నిర్వహించి మూత్ర పిండాలు తొలగిస్తారని
పోలీసులు చెప్పారు.
మూత్ర
పిండాల దాతలకు లక్ష రూపాయల వరకు
ఇచ్చి, మూత్రపిండాలు ఏర్పాటు చేసినందుకు వాటిని తీసుకునేవారి నుంచి 15 నుంచి 20 లక్షల రూపాయల వరకు
వసూలు చేసేవారని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. యాదగిరి అనే వ్యక్తి ఇచ్చిన
ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు
నమోదు చేసిన నిందితులిద్దరిని అదుపులోకి
తీసుకున్నారు.
0 comments:
Post a Comment