హైదరాబాద్:
మద్దెలచెర్వు సూరి హత్య కేసులో
ప్రధాన నిందితుడు భాను కిరణ్ కేసులో
సిఐడి పోలీసులు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మను
విచారించే అవకాశముందని తెలుస్తోంది. రామ్ గోపాల్ వర్మ
గతంలో రక్త చరిత్ర-1, 2లు
తీసిన విషయం తెలిసిందే. అవి
పరిటాల రవి, మద్దెలచెర్వు సూరి
నిజ జీవిత కథాంశంతో తీసిన
సినిమాలు. రక్త చరిత్ర సినిమాలో
మద్దెలచెర్వు సూరి పెట్టుబడులు పెట్టినట్లుగా
అప్పట్లో వార్తలు వచ్చాయి.
దీంతో
రాం గోపాల్ వర్మను సిఐడి అధికారులు ప్రశ్నించే
అవకాశముందని అంటున్నారు. రక్త చరిత్ర సినిమా
కథ కోసం వర్మ సూరిని
కలిసి వివరాలు సేకరించారు. ఈ సినిమాకు సి.కల్యాణ్ సమర్పకులు. అయితే కల్యాణ్ ప్రధానంగా
కనిపిస్తున్నప్పటికీ వెనుక సూరి, భానులు
పెట్టుబడులు పెట్టి ఉంటారని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో రాం గోపాల్
వర్మకు త్వరలో నోటీసులు పంపించి విచారణ చేయాలని పోలీసులు భావిస్తున్నారని తెలుస్తోంది.
రక్త
చరిత్ర సినిమాకు కల్యాణ్ సమర్పకులు కాబట్టి, ఆ నిర్మాతకు భాను
కిరణ్తో లింకులు బయటపడినందున
వర్మను విచారిస్తే మరింత సమాచారం బయటకు
వచ్చే అవకాశముందని సిఐడి పోలీసులు భావిస్తున్నట్లుగా
తెలుస్తోంది. కాగా ఇటీవల మద్దెలచెర్వు
సూరి హత్య కేసులో ప్రధాన
నిందితుడు భాను కిరణ్ను
సిఐడి పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన
విషయం తెలిసిందే. ఆయనన తొమ్మిది రోజులు
తమ కస్టడీలోకి తీసుకొని పోలీసులు విచారించారు.
తొమ్మిది
రోజుల పోలీసుల కస్టడీలో భాను కిరణ్ ఎన్నో
విషయాలు వెల్లడించినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కేసులో
భాగంగా పోలీసులు భాను కిరణ్ను
ఇటీవల మధ్య ప్రదేశ్లో
అతను నివసించిన షియోనికి తీసుకు వెళ్లి విచారణ జరిపారు. భాను తెలిపిన వివరాల
ప్రకారం సోదాలు నిర్వహించి రివాల్వర్లు స్వాధీనం చేసుకున్నారు.
కాగా భానును మరి కొన్ని రోజులు
సిఐడి పోలీసులు తమ కస్టడీకి అడిగే
అవకాశముంది.
0 comments:
Post a Comment