హైదరాబాద్:
తెలంగాణ అంశంపై కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు చిరంజీవి పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సిఫార్సు చేశారు. తెలంగాణ అంశాన్ని త్వరగా పరిష్కరించాలని ఆయన సోనియా గాంధీని
కోరారు. అందుకు సోనియా గాంధీ సానుకూలంగా ప్రతిస్పందించినట్లు
ఆయన తెలిపారు. ఓ ప్రముఖ తెలుగు
టీవీ చానెల్తో చిరంజీవి ఈ
విషయాలు చెప్పారు. తెలంగాణపై నిర్ణయం తీసుకోవడానికి 2014 దాకా ఆగాల్సిన అవసరం
లేదని తాను సోనియాతో చెప్పినట్లు
ఆయన తెలిపారు. అందుకు సోనియా గాంధీ సానుకూలంగా ప్రతిస్పందించినట్లు
చెప్పారు.
తెలంగాణపై
పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా
దానికి తాను కట్టుబడి ఉంటానని
ఆయన చెప్పారు. తెలంగాణ సమస్యను సత్వరమే పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఆయన
అన్నారు. తెలంగాణ అంశాన్ని వెంటనే పరిష్కరించాలని గతంలో కూడా చిరంజీవి
సోనియా గాంధీని, రాజ్యసభ సభ్యుడు రాహుల్ గాంధీని కోరారు. చిరంజీవి సమైక్యవాదానికి కట్టుబడి ఉన్నారు.
ప్రజారాజ్యం
పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన తెలంగాణ రాష్ట్ర
ఏర్పాటు ప్రక్రియను ఏర్పాటు చేస్తూ సమైక్యవాదాన్ని బలపరుస్తూ సీమాంధ్రలో పర్యటనలు కూడా చేశారు. రాష్ట్రం
కలిసే ఉండాలని ఆయన గట్టిగా వాదించారు.
అయితే, అంతకు ముందు మాత్రం
సామాజిక తెలంగాణకు తాను మద్దతు ఇస్తానని
చెప్పారు. ఎన్నికల్లో తగిన ఫలితాలు రాకపోవడంతో
తెలంగాణకు వ్యతిరేకంగా చిరంజీవి నిర్ణయం తీసుకున్నట్లు చెబుతారు.
తెలంగాణ
సమస్యను నానుస్తూ ఉండడం వల్ల అస్థిరత
నెలకొంటోందని సీమాంధ్ర నాయకులు కూడా భావిస్తున్నారు. తెలంగాణ
సమస్య వల్ల రాష్ట్రానికి రావాల్సిన
పెట్టుబడులు ఆగిపోతున్నాయని వారు వాదిస్తున్నారు. సమైక్యవాదాన్ని
సమర్థిస్తూనే తెలంగాణ సమస్యను త్వరగా పరిష్కరించాలని వారు కాంగ్రెసు అధిష్టానాన్ని
కోరుతున్నారు.
0 comments:
Post a Comment