తమిళనాడు
నీళ్లు తాగి జీవించాను కనుక
తమిళం అన్నా, తమిళనాడు అన్నా, తమిళ ప్రజలు అన్నా
ఎనలేని అభిమానం అని తన తండ్రి
ఎన్ టీఆర్ చెప్పేవారన్నారు. తానూ
తమిళనాడులోనే పుట్టి
పెరిగానని బాలకృష్ణ్ణ గుర్తు చేశారు. బాలకృష్ణ గెస్ట్ రోల్ చేసిన ఊ
కొడతా రా... ఉలిక్కి పడతారా
తమిళ వెర్షన్ వరువాన్ తలైవన్ చిత్ర పోస్టర్ ఆవిష్కరణ
చెన్నైలోని ఓ హోటల్లో
జరిగింది. బాలకృష్ణ మాట్లాడుతూ ఇలా స్పందించారు.
అలాగే
ఊ కొడతా రా... ఉలిక్కి
పడతారా చిత్రం భారీ ఎత్తున తెరకెక్కిం
దన్నారు. ఈ చిత్రాన్ని మంచు
లక్ష్మీప్రసన్న నిర్మిస్తున్నారన్నారు. తండ్రి మోహన్బాబు క్రమశిక్షణను
పునికి పుచ్చుకున్న లక్ష్మీప్రసన్న ఈ చిత్రా న్ని
ఖర్చుకు వెనుకాడకుండా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారన్నారు. చిత్రం కోసం రూ.6 కోట్ల
వ్యయంతో గంధర్వ మహల్ సెట్ను
వేసినట్లు చెప్పారు. మంచు మనోజ్ మరో
హీరోగా చక్కగా నటించారని ప్రశంసించారు. ఊ కొడతారా... ఉలిక్కి
పడతారా అన్ని వర్గాల వారిని
ఆకట్టుకునే చిత్రం అవుతుందన్నారు.
చివరగా
తమిళం లో నటిస్తారా అన్న
మీడియా వారి ప్రశ్నపై బాలకృష్ణ
తప్పకుండా మంచి అవకాశం వస్తే
చేస్తాను అన్నారు. ఇక శ్రీరామరాజ్యాన్ని తమిళ
ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారని తెలిపారు.
వరువాన్ తలైవన్ చిత్ర తొలి పోస్టర్ను దర్శకుడు పి.వాసు, నిర్మాత, దర్శకుడు
టి.రామారావు ఆవిష్కరించారు. ఈ సమావేశంలో మంచు
లక్ష్మీప్రసన్న, మనో జ్, ప్రభ,
శింబు, భానుచందర్, మనోబాలా, దర్శకుడు శేఖర్ రాజా తదితరులు
పాల్గొన్నారు.
బాలకృష్ణ
ఈ ప్రాజెక్టుపై బాగా నమ్మకంగా ఉన్నారు.
ఆయన మాట్లాడుతూ...'శ్రీరామరాజ్యం, ఊ కొడతారా ఉలిక్కిపడతారా
చిత్రాలలో నటించే అవకాశం రావడం అదృష్టం. ఓ
వరం' అని అన్నారు. ఇందులోని
పాత్రలకు, గంధర్య మహల్ సెట్‌కు
వున్న సంబంధమేంటో సినిమా చూశాకే తెలుస్తుందని, జూన్లో చిత్రాన్ని
విడుదల చేస్తామని లక్ష్మీ ప్రసన్న తెలిపింది. రీసెంట్ గానే ఈ చిత్రం
లోగో ఆవిష్కరణ ఘనంగా జరిగింది.
0 comments:
Post a Comment