పవన్
కళ్యాణ్, బాలకృష్ణ ఒకే తరహా పాత్రలో
త్వరలో కనిపించనున్నారు. యాధృచ్చికంగా జరుగుతున్నా ఈ పాత్రలుని ఒకదానికొకటి
పోల్చి చూసుకోవటం గ్యారెంటీ అంటున్నారు. ఇంతకీ ఆ పాత్ర
మరేదో కాదు జర్నలిస్టు. బాలకృష్ణ
తన తాజా చిత్రం 'శ్రీమన్నారాయణ'
లో పవర్ ఫుల్ జర్నిలిస్టు
గా కనిపించి అలరించనున్నాడు. రవిచావలి దర్శకత్వంలో ఈ చిత్రం వేగంగా
తెరకెక్కుతోంది. మరో ప్రక్క పూరీ
దర్శకత్వంలో పవన్ చేయబోతున్న కెమెరామెన్
గంగతో రాంబాబు చిత్రంలో కూడా పవన్...జర్నిలిస్టు
గా కనిపిస్తున్నారు.
ఇక 'శ్రీమన్నారాయణ'లో బాలకృష్ణ క్యారక్టైరైజేషన్
గురించి దర్శకుడు రవిచావలి మాట్లాడుతూ... పెన్-గన్ రెండింటికీ
చరిత్ర సృష్టించే నైజం ఉంది. రెండూ
సమాజం మనుగడను శాసించేవే. కానీ తుపాకీకి గురి
ఒక్కటే తెలుసు. గెలుపు గురించి తప్ప మంచీ, చెడు
ధ్యాస ఉండదు. లక్ష్యం, పోరాటం, ఆశయం... ఇవన్నీ కలానికి ఉంటాయి. బుల్లెట్ రక్తం చిందిస్తే - సిరా
జ్ఞానాన్ని అందిస్తుంది. శ్రీమన్నారాయణ కూడా అదే చేశాడు.
బలం, బలగం చేయలేని పని
తన కలం చేత చేయించాడు.
అదెలాగో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే
అన్నారు రవికుమార్ చావలి.
'శ్రీమన్నారాయణ'లో నందమూరి బాలకృష్ణ
సరసన పార్వతీ మెల్టన్, ఇషా చావ్లా హీరోయిన్స్
గా చేస్తున్నారు. రమేష్ పుప్పాల నిర్మాత. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్సిటీలో చిత్రీకరణ జరుగుతోంది. అక్కడ ప్రిన్స్ స్ట్రీట్‌లో కొన్ని కీలక
సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ ''కథాబలం ఉన్న చిత్రమిది. బాలకృష్ణను
ఓ శక్తిమంతమైన పాత్రలో చూపించబోతున్నాం. ఆయనో బాధ్యతగల పాత్రికేయుడిగా
కనిపిస్తారు. త్వరలో యూరప్లో మూడు
గీతాల్ని తెరకెక్కిస్తాము'' అన్నారు. సమర్పణ: ఆర్.ఆర్.మూవీమేకర్స్,
సంగీతం: చక్రి.
పవన్
కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో
యూనివర్సల్ మీడియా పతాకంపై డి.వి.వి.
దానయ్య నిర్మించే 'కెమెరామేన్ గంగతో రాంబాబు'ని
సూర్యదేవర రాధాకృష్ణ సమర్పిస్తున్నారు. పూరీ ఈ విషయమై
మాట్లాడుతూ... 'బద్రి' సినిమాతో నాకు లైఫ్ ఇచ్చిన
పవన్ కళ్యాణ్ గారితో మరో సినిమా చేయాలని
చాలా సార్లు ప్లాన్ చేశాం. కానీ ఎందుకో మా
కాంబినేషన్ అలా అలా డిలే
అయి ఇప్పటికి కుదిరింది. దర్శకునిగా నాకు 25వ చిత్రం. ఇది
ఓ న్యూస్ రిపోర్టర్ కథ. పవన్ కళ్యాణ్
నుంచి ప్రేక్షకులు, అభిమానులు ఆశించే అన్ని అంశాలూ ఉండే
డిఫరెంట్ యాక్షన్ ఫిలిం ఇది. మే
రెండో వారంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. అక్టోబరు 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల
చేస్తాం' అన్నారు.
0 comments:
Post a Comment