ప్రపంచంలో
కెల్లా అత్యంత చవక ధరకే కారును
( టాటా నానో) తయారు చేసి,
ఆటోమొబైల్ రంగంలో ఓ సరికొత్త సంచలనాన్ని
సృష్టించిన టాటా మోటార్స్, ఇటీవల
గాలితో నడిచే కార్లను విజయవంతంగా
పరీక్షించామని ఓ ప్రకటనలో పేర్కొన్న
సంగతి తెలిసిందే. కాగా... మోటార్ డెవలప్మెంట్ ఇంటర్నేషనల్ (లక్సెంబర్గ్)
నుండి టాటా మోటార్స్ లైసెన్స్
పొంది అభివృద్ధి చేస్తున్న ఎయిర్-పవర్డ్ వాహనాలు
ఈ ఏడాది చివరి నాటికి
మార్కెట్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇప్పటికే
ఈ కారు అభివృద్ధి మొదటి
దశను (టెస్టింగ్ ఫేజ్)ను పూర్తి
చేసిన టాటా మోటార్స్ రెండవ
దశపై దృష్టి సారించింది. రెండవ దశలో భాగంగా
ప్రొడక్షన్కు సిద్ధంగా ఉన్న
ఎయిర్-పవర్డ్ వాహనాలను టాటా మోటార్స్ తయారు
చేయనుంది. కంప్రెస్డ్-ఎయిర్తో నడిచే
రెండు వాహనాలను టాటా మోటార్స్ డెవలప్
చేసింది. ఇందులో చిన్న తరహా వాణిజ్య
వాహనంగానూ, మరొకటి ప్యాసింజర్ కారు గానూ ఉండనున్నాయి.
గడచిన
2007వ సంవత్సరంలో మోటార్ డెవలప్మెంట్ ఇంటర్నేషనల్ (లక్సెంబర్గ్)
మరియు టాటా మోటార్స్ కంపెనీలు
ఓ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందంలో భాగంగా,
ఎమ్డిఐ టెక్నాలజీని ఉపయోగించి
కంప్రెస్డ్-ఎయిర్ ద్వారా నడిచే
కార్లను టాటా మోటార్స్ ఉత్పత్తి
చేసి, ఇండియన్ మార్కెట్లో విక్రయిస్తుంది. ఈ గాలితో నడిచే
వాహనాలు గరిష్టంగా గంటకు 80 కి.మీ. వేగంతో
పరుగులు పెడుతూ, సుమారు 300 కి.మీ రేంజ్
వరకూ ప్రయాణిస్తాయి.
టాటా
మోటార్స్ అభివృద్ధి చేసిన ఈ ఎయిర్-పవర్డ్ కారులో ఓ ఎయిర్ ట్యాంక్
అమర్చబడి ఉంటుంది. దీనిని నింపడానికి కేవలం రెండు డాలర్లు
(సుమారు 100 రూపాయలు) మాత్రమే ఖర్చు అవుతుంది. ఇంటిలో
ఉండే ఎయిర్ కంప్రెసర్ ద్వారా
ఈ ట్యాంక్ను ఫిల్ చేసుకోవడానికి
3-4 గంటల సమయం పడుతుంది. పూర్తి
ఎయిర్ట్యాంక్తో సుమారు 300 కి.మీ. ప్రయాణించవచ్చు. తక్కువు
బరువుండేలా ఈ కారును డిజైన్
చేయటం వలన ఎక్కువ దూరం
ప్రయాణించేదుకు వీలవుతుంది. దీనిలో కంబ్యూషన్ ఇంజన్ ఉండదు కాబట్టి,
కేవలం 50,000 కి.మీ. ఒక్కసారి
చొప్పున ఆయిల్ మార్పిడి చేస్తే
సరిపోతుంది.
0 comments:
Post a Comment