Showing posts with label TATA. Show all posts
Showing posts with label TATA. Show all posts

Tuesday, July 3, 2012

Tata new concept car 'Megapixel' at Goodwood Festival of Speed 2012

tata megapixel at goodwood festival of speed  

గడచిన మార్చి నెలలో జెనీవాలో జరిగిన 82వ అంతర్జాతీయ మోటార్ షోలో టాటా ఆవిష్కరించిన హైబ్రిడ్ కాన్సెప్ట్ కారు 'టాటా మెగాపిక్సెల్' ప్రస్తుతం బ్రిటన్‌లో కొలువుదీరింది. బ్రిటన్‌లో అంగరంగ వైభవంగా జరుగుతున్న 'గుడ్‌వుడ్ ఫెస్టివల్ ఆఫ్ స్పీడ్' మోటార్ షోలో టాటా తమ హైబ్రిడ్ కాన్సెప్ట్ కారును ప్రదర్శించింది. టాటా మెగాపిక్సెల్ ఇటు బ్యాటరీ పవర్‌తోనూ అటు పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఇది లీటరుకు వంద కిలోమీటర్ల (బ్యాటరీ పవర్‌తో కలిపి) వరకూ మైలేజీనిస్తుందని టాటా పేర్కొంది.

టాటా ప్రత్యేకించి మెగాపిక్సెల్‌ను యూరోపియన్ మార్కెట్ల కోసం డిజైన్ చేసింది. యూరోపియన్ వెర్షన్ టాటా నానో యూరప్ మార్కెట్లలో ప్రవేశపెట్టడానికి బదులు దానికన్నా మెరుగైన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కారును అక్కడి మార్కెట్లలో విడుదల చేయాలని టాటా మోటార్స్ నిర్ణయించింది. ఈ దిశగా పరిశోధనలు చేసిన టాటా సాంకేతిక విభాగం తొలుత పిక్సెల్ కాన్సెప్ట్‌ను, అనంత దీని ఫ్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని మెగాపిక్సెల్ కాన్సెప్ట్ కారును అభివృద్ధి చేసింది.

మెగాపిక్సెల్ హైబ్రిడ్ కాన్సెప్ట్ కారులో నాలుగు ఎలక్ట్రిక్ మోటార్లు (ఒక్కొక్క చక్రంలో ఒక్కొక్క మోటార్) ఉంటాయి. ఇవి 13 కి.వా. లిథియం అయాన్ ఫాస్పేట్ బ్యాటరీ ఆధారంగా పనిచేస్తాయి. బ్యాటరీ పవర్ ద్వారా టాటా మెగాపిక్సెల్‌పై 54 మైళ్ల దూరం ప్రయాణించవచ్చు. ఈ బ్యాటరీలను ఇండక్షన్ ఛార్జింగ్ సిస్టమ్‌ను ఉపయోగించి రీచార్జ్ చేసుకోవచ్చు.

ఒకవేళ ఎలక్ట్రిక్ పవర్ (బ్యాటరీ ఛార్జ్) ఖాలీ అయిపోయినట్లయితే ఇందులో ఉండే చిన్నపాటి 30 బిహెచ్‌పి 325సీసీ సింగిల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ సాయంతో కారును నడపొచ్చు. దీని పెట్రోల్ ట్యాంక్‌ను ఒక్కసారి ఫుల్ చేస్తే సుమారు 900 కి.మీ. దూరం ప్రయాణించవచ్చు.

రేంజ్ ఎక్స్‌టెండెడ్ ఎలక్ట్రిక్ వెహికల్ (రీవ్) కాన్సెప్ట్ ఆధారంగా చేసుకుని ఈ ఫోర్-సీటర్ సిటీ స్మార్ట్ కారు యూరప్‌లోని టాటా డిజైన్ విభాగం రూపొందించింది. టాటా మెగాపిక్సెల్ టర్నింగ్ రేడియస్ కేవలం 5.6 మీటర్లు మాత్రమే. ఇది గరిష్టంగా గంటకు 100 కి.మీ. వేగంతో పరుగులు తీస్తుంది.

Thursday, June 28, 2012

TATA Motors fined for selling under performing car

మనం ఏదైనా ఒక చిన్న వస్తువును కొనుగోలు చేసేటప్పుడు అద్ బావుందో లేదోనని ఒకటి నాలుగు సార్లు క్షుణ్ణంగా పరిశీలిస్తాం. అలాంటిది కారును కొనుగోలు చేసేటప్పుడు మరింత జాగ్రత్తతో వ్యవహరించాలి. లేకపోతే కొందరు జాదూగర్ డీలర్లు డొక్కు కార్లను కొనుగోలుదారులకు అంటగట్టేస్తారు. ఇలాంటి ఓ సంఘటనే ఇటీవల ఢిల్లీలో జరిగింది.

ఢిల్లీలోని ఓ టాటా మోటార్స్ అధీకృత డీలర్ సరిగ్గా పనిచేయని టాటా ఇండికా కారును ఓ కస్టమర్‌కు అంటగట్టాడు. ఆ కారును పదే మెకానిక్ షెడ్డు తీసుకువెళ్తూ చిరాకొచ్చిన సదరు కస్టమర్‌ ఈ సమస్య గురించి కన్జ్యూమర్ కోర్టును ఆశ్రయించాడు. నిజానిజాలను విచారించిన ఢిల్లీ స్టేట్ కన్జ్యూమర్ కమిషన్ సదరు కస్టమర్‌కు నష్టపరిహారంగా రూ.1.93 లక్షలను చెల్లించాల్సిందిగా టాటా మోటార్స్‌ను, దాని డీలర్‌ను ఆదేశిచింది.

స్టేట్ కమిషన్ అధ్యక్షుడు, జస్టిస్ బ్రర్కత్ అలీ జైదితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మొత్తంలో డిప్రిషియేషన్ తర్వా కారు ఖరీదు రూ.1.73 లక్షలను మరియు ఇన్నాళ్లు అతను పడిన మనోవేదను, ఇబ్బందికి గానూ రూ.20,000 నష్టపరిహారాన్ని చెల్లించాల్సిందిగా తీర్మానం చేసింది.

అయితే, టాటా మోటార్స్ మాత్రం కస్టమర్ వాజ్యాన్ని తోసిపుచ్చింది. తమ వద్దకు సర్వీసింగ్ వచ్చినప్పుడు కస్టమర్ చెప్పిన లోపాలన్నింటినీ సవరించామని పేర్కొంది. కారులో ఏదైనా లోపాన్ని గుర్తించిన వెంటనే కస్టమర్ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా దాన్ని సరిచేసి ఇచ్చామని కంపెనీ తెలిపింది.

Tuesday, May 15, 2012

Tata Air Cars may released in this year end


ప్రపంచంలో కెల్లా అత్యంత చవక ధరకే కారును ( టాటా నానో) తయారు చేసి, ఆటోమొబైల్ రంగంలో సరికొత్త సంచలనాన్ని సృష్టించిన టాటా మోటార్స్, ఇటీవల గాలితో నడిచే కార్లను విజయవంతంగా పరీక్షించామని ప్రకటనలో పేర్కొన్న సంగతి తెలిసిందే. కాగా... మోటార్ డెవలప్మెంట్ ఇంటర్నేషనల్ (లక్సెంబర్గ్) నుండి టాటా మోటార్స్ లైసెన్స్ పొంది అభివృద్ధి చేస్తున్న ఎయిర్-పవర్డ్ వాహనాలు ఏడాది చివరి నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇప్పటికే కారు అభివృద్ధి మొదటి దశను (టెస్టింగ్ ఫేజ్)ను పూర్తి చేసిన టాటా మోటార్స్ రెండవ దశపై దృష్టి సారించింది. రెండవ దశలో భాగంగా ప్రొడక్షన్కు సిద్ధంగా ఉన్న ఎయిర్-పవర్డ్ వాహనాలను టాటా మోటార్స్ తయారు చేయనుంది. కంప్రెస్డ్-ఎయిర్తో నడిచే రెండు వాహనాలను టాటా మోటార్స్ డెవలప్ చేసింది. ఇందులో చిన్న తరహా వాణిజ్య వాహనంగానూ, మరొకటి ప్యాసింజర్ కారు గానూ ఉండనున్నాయి.

గడచిన 2007 సంవత్సరంలో మోటార్ డెవలప్మెంట్ ఇంటర్నేషనల్ (లక్సెంబర్గ్) మరియు టాటా మోటార్స్ కంపెనీలు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఒప్పందంలో భాగంగా, ఎమ్డిఐ టెక్నాలజీని ఉపయోగించి కంప్రెస్డ్-ఎయిర్ ద్వారా నడిచే కార్లను టాటా మోటార్స్ ఉత్పత్తి చేసి, ఇండియన్ మార్కెట్లో విక్రయిస్తుంది. గాలితో నడిచే వాహనాలు గరిష్టంగా గంటకు 80 కి.మీ. వేగంతో పరుగులు పెడుతూ, సుమారు 300 కి.మీ రేంజ్ వరకూ ప్రయాణిస్తాయి.

టాటా మోటార్స్ అభివృద్ధి చేసిన ఎయిర్-పవర్డ్ కారులో ఎయిర్ట్యాంక్ అమర్చబడి ఉంటుంది. దీనిని నింపడానికి కేవలం రెండు డాలర్లు (సుమారు 100 రూపాయలు) మాత్రమే ఖర్చు అవుతుంది. ఇంటిలో ఉండే ఎయిర్ కంప్రెసర్ ద్వారా ట్యాంక్ను ఫిల్ చేసుకోవడానికి 3-4 గంటల సమయం పడుతుంది. పూర్తి ఎయిర్ట్యాంక్తో సుమారు 300 కి.మీ. ప్రయాణించవచ్చు. తక్కువు బరువుండేలా కారును డిజైన్ చేయటం వలన ఎక్కువ దూరం ప్రయాణించేదుకు వీలవుతుంది. దీనిలో కంబ్యూషన్ ఇంజన్ ఉండదు కాబట్టి, కేవలం 50,000 కి.మీ. ఒక్కసారి చొప్పున ఆయిల్ మార్పిడి చేస్తే సరిపోతుంది.

Monday, May 7, 2012

Tata motors Air Powered Cars


ప్రపంచంలోనే అత్యంత చవక ధరకే కారును సృష్టించడమే కాకుండా, దానిని విజయవంతంగా మార్కెట్లోకి తీసుకువచ్చిన టాటా మోటార్స్ గాలితో నడిచే కారును అభివృద్ధి చేస్తున్నట్లు గతంలో కథనంలో ప్రచురించిన సంగతి తెలిసిందే. టాటా మోటార్స్ అభివృద్ధి చేసిన గాలితో నడిచే కారును ప్రయోగాత్మకంగా టెస్టింగ్ చేశామని కంపెనీ ప్రకటనలో పేర్కొంది.

మోటార్ డెవలప్మెంట్ ఇంటర్నేషనల్ (లక్సెంబర్గ్) నుండి టాటా మోటార్స్ లైసెన్స్ పొంది అభివృద్ధి చేస్తున్న ఎయిర్-పవర్డ్ కారు అభివృద్ధిలో ఇది మొదటి దశ. 2007లో రెండు కంపెనీలు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఒప్పందంలో భాగంగా, ఎమ్డిఐ టెక్నాలజీని ఉపయోగించి కంప్రెస్డ్-ఎయిర్ ద్వారా నడిచే కార్లను టాటా మోటార్స్ ఉత్పత్తి చేసి, ఇండియన్ మార్కెట్లో విక్రయిస్తుంది.

ఎయిర్-పవర్డ్ కార్ రెండవ దశలో భాగంగా, రెండు కంపెనీలు కలిసి అభివృద్ధిని పూర్తి చేసి, ప్రొడక్షన్కు సిద్ధంగా ఉండే కారును తయారు చేయనున్నాయి. టెక్నాలజీని ఇటు ప్యాసింజర్, అటు కమర్షియల్ వాహనాల్లో ఉపయోగించుకోవచ్చని కంపెనీ చెబుతోంది.

టాటా మోటార్స్ ఇప్పటికే నీటితో నడిచే కారును కూడా అభివృద్ధి చేయడంలో బిజీగా ఉంది. టాటా మోటార్స్ అభివృద్ధి చేసిన ఎయిర్-పవర్డ్ కారులో ఎయిర్ట్యాంక్ అమర్చబడి ఉంటుంది. ఒక పూర్తి ఎయిర్ట్యాంక్తో సుమారు 300 కి.మీ. ప్రయాణించవచ్చు. తక్కువు బరువుండేలా కారును డిజైన్ చేయటం వలన ఎక్కువ దూరం ప్రయాణించేదుకు వీలవుతుంది.

Disclaimer

Buy original DVDs, CDs and cassettes from the nearest store. These are provided to give users the idea of best movies & music. All the rights are reserved to the audio company. This blog owner holds no responsibility for any illegal usage of the content.
Related Posts Plugin for WordPress, Blogger...

TW

Surfguiden
DMCA.com

feeds

Submit Blog & RSS Feeds Best Indian websites ranking submit site Increase traffic Entertainment Blogs
Entertainment directory BritBlog
Online Marketing
Oferty i praca w Zarabiaj.pl Submit Your Site To The Web's Top 50 Search Engines for Free!

wibiya widget