రాజమండ్రి:
కర్ణాటక రాజధాని బెంగుళూర్కు చెందిన ఓ
టెక్కీ రాజమండ్రిలో సంభవించిన పేలుడులో తన రెండు చేతులను,
కళ్లను పోగొట్టుకున్నాడు. తన బావ ఇంట్లో
మంగళవారం టైం బాంబును తయారు
చేస్తుండగా ఈ పేలుడు సంభవించినట్లు
తెలుస్తోంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల
కోసం అతను బాంబును తయారు
చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
బాధితుడిని
ఆకే జగదీష్గా పోలీసులు గుర్తించారు.
అతనికి ఏదైనా తీవ్రవాద గ్రూపుతో
గానీ మావోయిస్టులతో గానీ సంబంధాలున్నాయా అనే
విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. తలుపులు
బయట నుంచి వేసి ఉన్నాయి.
లోపల ప్రమాదం సంభవించింది. తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లే సరికి జగదీష్ రక్తం
మడుగులో పడి ఉన్నాడు.
టైం బాంబును తయారు చేస్తుండగా పేలుడు
సంభవించినట్లు అనుమానిస్తున్నారు. ఈ పేలుడలో అతని
రెండు చేతులు పోయాయి. చూపు కూడా పోయింది.
అతన్ని కాకినాడ ఆస్పత్రిలో చేర్చారు. అతని పరిస్థితి ఆందోళనకరంగా
ఉంది. ఇనుప రాడ్లకు దగ్గరగా
పడి ఉన్న టైమర్ను
పోలీసులు కనిపెట్టారు. గిలిటెన్ స్టిక్స్తో పాటు ఇతర
పేలుడు పదార్థాలను కూడా వారు గుర్తించారు.
రాజమండ్రిలోని
తిలక్ రోడ్డులో గల రెండంతస్థుల భవనంలోని
కింది గ్రౌండ్ ఫ్లోర్లో మంగళవారం మధ్యాహ్నం
రెండు, రెండున్నర గంటల మధ్య ఈ
పేలుడు సంభవించింది. స్థానికులకు పేలుడు శబ్దం వినిపించింది. దాంతో
వారు పోలీసులకు సమాచారం అందించారు.
జగదీష్
రెండు రోజుల క్రితం బెంగళూర్లోని తన బావ
ఇంటికి వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. కేబుల్ ఆపరేటర్ అయిన జగదీష్ బావ
రామకృష్ణ సంఘటన జరిగిన సమయంలో
ఇంట్లో లేడు.
0 comments:
Post a Comment