హైదరాబాద్:
ఓ తెలుగు సినీ నిర్మాత నుంచి
డబ్బులు వసూలు చేసినట్లు మద్దెలచెర్వు
సూరి హత్య కేసులో ప్రధాన
నిందితుడు భాను కిరణ్ సిఐడికి
ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పాడు. నిర్మాత నుంచి ఏడు కోట్ల
రూపాయలు వసూలు చేసినట్లు వార్తలు
వచ్చాయి. తన నేరాంగీకార పత్రంలో
భాను కిరణ్ పలు విషయాలు
వెల్లడించాడు. మంగలి కృష్ణ, శ్రీకాంత్
గౌడ్, మన్మోహన్ సింగ్లతో కలిసి
23 సెటిల్మెంట్లు చేసినట్లు అతను తెలిపాడు. మంగలి
కృష్ణ నుంచి ఆయుధాలు కొనుగోలు
చేసినట్లు అతను అంగీకరించాడు.
తొమ్మిది
రోజుల కస్టడీ ముగియడంతో సిఐడి అధికారులు భాను
కిరణ్ను శుక్రవారం కోర్టులో
ప్రవేశపెట్టారు. అనంతరం 48 పేజీలతో కూడిన నేరాంగీకార పత్రాన్ని
దాఖలు చేసింది. మొత్తం తొమ్మిది ఆయుధాలు కొనుగోలు చేసినట్లు అతను తెలిపాడు. వీటిని
మంగలి కృష్ణ, వాసుదేవ రెడ్డి తదితరుల నుంచి పొందినట్లు అతను
చెప్పాడు. వంచవటి మాల్లో రెండు
రివాల్వర్లు తీసుకున్నాననిత 2009లో పద్మనాభ రెడ్డి
అనే వ్యక్తి ద్వారా పిస్టల్, సుధాకర్ నాయుడు ద్వారా రివాల్వర్ తీసుకున్నానని అతను వివరించాడు.
ధర్మవరం
మాజీ శాసనసభ్యుడు కేతిరెడ్డి సూర్యప్రతాప రెడ్డి లెటర్ హెడ్ నుంచి
హైదరాబాదులోని ఆబిడ్స్లో రెండు లైసెన్స్డ్ తుపాకులు కొనుగోలు
చేసినట్లు తెలిపాడు. సూరి విశాఖ, చర్లపల్లి
జైళ్లలో ఉన్నప్పుడు మంగలి కృష్ణతో కలిసి
లావాదేవీలు నిర్వహించినట్లు అతను అంగీకరించాడు. హందీనీవా
లో 178 కోట్ల రూపాయల ప్రాజెక్టును
ఎల్ వన్ కాంట్రాక్టర్లను బెదిరించి
కెవిఎన్ రెడ్డి అనే కాంట్రాక్టర్కు
ప్రాజెక్టు దక్కేలా చేశానని అతను చెప్పాడు.
సూరికి
తెలియకుండా కొన్ని సెటిల్మెంట్లు చేసినట్లు తెలిపాడు. సూరీ జైలులో ఉండగా
పోరెడ్డి ప్రభాకర రెడ్డి ద్వారా కొన్ని సెటిల్మెంట్లు చేసినట్లు తెలిపాడు. గంగుల సుందర్ రెడ్డి,
సత్యనారాయణలతో కలిసి గంతోల మద్యం
వ్యాపారం చేసినట్లు వెల్లడించాడు. అప్పుడే సూరి పరిచయమైనట్లు అతను
తెలిపాడు. మంగలి కృష్ణ, హేమలతా
రెడ్డి, న్యాయవాది శ్రీకాంత్ గౌడ్లతో కలిసి
ఢిల్లీ స్థాయిలో సూరి బెయిల్ కోసం
ప్రయత్నాలు చేసినట్లు తెలిపాడు.
శౌరి
ఎస్టేట్ పేరు మీద బందరు
పోర్టులో 90 ఎకరాల భూములు కొనుగోలు
చేసినట్లు అతను తెలిపాడు. రంగారెడ్డి
జిల్లా చేవెళ్లలో 3.27 ఎకరాలు చేవెళ్ల సింగప్పగుడాలో 19 ఎకరాల స్థలం కొనుగోలు
చేసినట్లు భాను చెప్పాడు. కరీంనగర్
జిల్లా ధర్మవరంలో 60 ఎకరాల స్థల వివాదంలో
తలదూర్చినట్లు చెప్పాడు. హైదరాబాదులోని మాదాపూర్లో ఏడెకరాల స్థల
వివాదంలో కూడా సెటిల్మెంట్ చేసినట్లు
అతను చెప్పనట్లు వార్తలు వచ్చాయి. మహేశ్వరం పెండ్యాలలో 5.2 ఎకరాల స్థల వివాదం,
ఉప్పాలగుడాలో 36 ఎకరాల స్థల వివాదం
సెటిల్ చేసినట్లు అతను తెలిపాడు. ఇలా
మరిన్ని సెటిల్మెంట్ల వివాదాల గురించి కూడా అతను చెప్పాడు.
0 comments:
Post a Comment