ఇండో-కెనిడియన్ పోర్న్ స్టార్ సన్నిలియోన్ ని తమ తాజా
చిత్రం దేనికైనా రెడీలో పెట్టాలని యూనిట్ మొత్తం నిర్ణయించుకుంది. ఆమెకు అడ్వాన్స్ సైతం
ఇవ్వటానికి రెడి అయ్యారు. అయితే
ఈ విషయం తెలుసుకున్న మోహన్
బాబు మండిపడ్డారు. హీరోయిన్ అంటే అలాంటి అలోచనలు
చేయవద్దని సీరియస్ అయ్యారు. జి.నాగేశ్వర రెడ్డి
దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సన్నిలియోన్
ని సెకండ్ హీరోయిన్ గా తీసుకురావాలనే ఆలోచన
ఈ విధంగా వెనకపడిందని సమాచారం. మొదటి హీరోయిన్ గా
హన్సిక చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ చిత్రాన్ని మోహన్ బాబు 24 ఫ్రేమ్స్
ఫ్యాక్టరీ పతాకంపై నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలో షూటింగ్ సాగుతోంది. ఆద్యంతం వినోదభరితంగా నాగేశ్వరరెడ్డి ఈ సినిమాను మలుస్తున్నారు.
యువతరాన్ని ఆకట్టుకునే విధంగా హన్సిక పాత్ర ఉంటుంది. క్లైమాక్స్,
రెండు పాటలు మినహా సినిమా
పూర్తయింది. విష్ణు ఈ చిత్రం గురించి
చెబుతూ ''రెండున్నర గంటలపాటు హాయిగా నవ్వించేలా ఉంటుందీ చిత్రం. ప్రతి పాత్ర కావల్సినంత
వినోదాన్ని పంచుతుంది. ఈ వేసవిలోనే చిత్రాన్ని
ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము. నా కెరీర్లో
ప్రత్యేకస్థానంలో నిలిచే సినిమా ఇది''అన్నారు. ‘ఢీ’ తర్వాత
ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసేలా ఈ చిత్రం తన
కెరీర్లో నిలుస్తుందని విష్ణు
తెలిపారు.
ఇక ఈ చిత్రం కథ
గురించి దర్శకుడు చెపుతూ... ఆడుతూపాడుతూ జీవితాన్ని గడిపేసే కుర్రాడతను. ఓ అందాల భామను
చూసి ప్రేమలోపడ్డాడు. ఆమె ఇంట్లోవాళ్లు సంప్రదాయాలూ...
పద్ధతులూ అంటూ సవాలక్ష నిబంధనలు
విధిస్తూ ఉంటారు. వాళ్లందరినీ ఒప్పించి ప్రేమను గెలిపించుకొనేందుకు అతగాడు దేనికైనా సిద్ధపడతాడు. మరి ఫలితం ఏ
రీతిన వచ్చిందో తెర మీదే చూడమంటున్నారు.
మంచి టైమింగ్తో కామెడీని పండించగలనని
‘ఢీ’ సినిమాతో నిరూపించారు విష్ణు. అలాగే కామెడీ సినిమాలను
తెరకెక్కించడంలో జి.నాగేశ్వరరెడ్డిది అందెవేసినచెయ్యి...
వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే
ఏ రేంజిలో ఎంటర్టన్ చేస్తుందో ఊహించుకోమంటున్నారు నిర్మాతలు.
ఈ చిత్రానికి కథ- బి.వి.ఎస్.రవి, స్క్రీన్ప్లే: కోన వెంకట్,
గోపీమోహన్, మాటలు: మరుధూరి రాజా, సంగీతం: చక్రి,
ఛాయాగ్రహణం: సిద్దార్థ్ అందిస్తున్నారు. ఎన్.వంశీకృష్ణ ఎగ్జిక్యూటివ్
ప్రొడ్యూసర్గా తెరకెక్కుతున్న ఈ
చిత్రానికి తెర వెనుక పనిచేస్తున్న
వారిలో వర్మ, సెల్వ, రఘు
కులకర్ణి, సాయిజ్యోతి, విజయ్ శ్రీనివాస్, సురేష్బాబు, నరసింహ, వాసు,
సుద్దాల అశోక్తేజ, భాస్కరభట్ల,
రామజోగయ్యశాస్త్రి తదితరులు ప్రముఖంగా ఉన్నారు. ఇక ఈ చిత్రానికి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.వంశీకృష్ణ, సమర్పణ:
శ్రీలక్ష్మీప్రసన్న పిక్చర్స్, నిర్మాణం: 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, నిర్మాత డా.ఎం.మోహన్
బాబు.
0 comments:
Post a Comment