పవన్
కళ్యాణ్ తాజా చిత్రం గబ్బర్
సింగ్ లో రాజశేఖర్ పై
వేసిన సెటైర్స్ గురించి దర్శకుడు హరీష్ శంకర్ ని
మీడియా ప్రశ్నించింది. దానికి హరీష్ స్పందిస్తూ...రౌడీల
అంత్యాక్షరిలో కొందరు హీరోల శైలిని అనుకరించేలా
కొన్ని సన్నివేశాలుండొచ్చు. కానీ అవమానపరిచే సన్నివేశాలు
మాత్రం ఇందులో లేవు. రోజూ టీవీల్లో
రాజకీయ నాయకుల నుంచి సినీ తారల
వరకు అందర్నీ అనుకరిస్తుంటారు. అందులో తప్పేముంది? ఆ మాటకొస్తే ఈ
సినిమాలో పవన్‌కల్యాణ్ ముందు,
ఆయన్నే అనుకరించే సన్నివేశాలున్నాయి కదా అన్నారు.
ఇక సెకండాఫ్ లో ...రౌడి లతో
పవన్ కళ్యాణ్ ..అంత్యాక్షరి పాడిస్తారు. అందులో ..రాజశేఖర్ ని అనుకరిస్తూ ఓ
రౌడి పాడతాడు. రోజ్ ..రోజ్ రోజా పువ్వా
అంటూ అల్లరి ప్రియుడులో సాంగ్ పాడతాడు. దానికి
పవన్ కళ్యాణ్ ...రాజశేఖర్ ని అనుకరిస్తూ..వచ్చిరాని
తెలుగులో తమిళ యాసలో...అబ్బ..అబ్బబ్బ ఏమి సేత్తిరి ఏమి
సేత్తిరి...ఎప్పుడూ ఇలానే సేస్తరా అంటూ
వెటకారంగా అంటారు. ఇక ఈ సెటైర్
మాత్రం ధియోటర్ లో బాగా పేలింది.
విపరీతమైన అప్లాజ్ వచ్చి ఈ రోజు
సినిమా హిట్స్ కి కారణాల్లో అది
ఒకటిగా మారింది.
పవన్కళ్యాణ్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని
‘దబాంగ్’ చిత్రాన్ని
తన స్టయిల్లో మార్పులుచేర్పులు చేసుకొని
నిర్మించినందువల్ల విజయం సాధించామని, తానొక
ఫాన్లా చిత్రాన్ని నిర్మించి
ఫాన్గానే చిత్ర విజయాన్ని
ఆస్వాదిస్తున్నానని, ఒక దర్శకుడిగా పవన్కళ్యాణ్ అభిమానులకు ఓ మంచి చిత్రాన్ని
అందించానన్న తృప్తి మిగిలిందని దర్శకుడు హరీష్శంకర్ తెలియజేశారు.
పవన్కళ్యాణ్, శృతిహాసన్ జంటగా పరమేశ్వర ఆర్ట్
ప్రొడక్షన్స్ పతాకంపై హరీష్శంకర్ దర్శకత్వంలో
బండ్ల గణేష్ నిర్మించిన చిత్రం
‘గబ్బర్‌సింగ్’ విడుదలైంది.
తొలి
రోజే చిత్రం విజయవంతమైన టాక్ సొంతం చేసుకుని
కలెక్షన్స్ కుంభ వృష్టి కురుస్తోంది.
అలాగే దర్శకుడు మాట్లాడుతూ పవన్ స్టామినాపైనే ఈ
చిత్రం మొత్తం ఆధారపడి వుందని, అహింసా పద్ధతిలో క్రిమినల్స్ను ఎదుర్కోవడం, సిగరెట్,
మద్యం వంటి విషయాలను ప్రోత్సహించకపోవడం
ఈ చిత్రంలో గమనించవచ్చని, తాను ఎలా చిత్రాన్ని
చూడాలనుకున్నానో అలానే ఈ చిత్రాన్ని
నిర్మించానని వివరించారు. పవన్తో డామ్షూర్ కొట్టాలన్న కసితో
ఈ చిత్రాన్ని నిర్మించామని, డైరెక్టర్ చెప్పింది చెప్పినట్టుగా తీయడంతో అభిమానులు పవన్కళ్యాణ్ను
పూర్వవైభవంతో ఆదరించడంతో ఇంత పెద్ద విజయం
సొంతమైందని తెలిపారు.
0 comments:
Post a Comment