హైదరాబాద్:
మద్దెలచెర్వు సూరి హత్య కేసు
ప్రధాన నిందితుడు భాను కిరణ్ ఇచ్చిన
నేరాంగీకార పత్రంలోని విషయాలను తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ను
లక్ష్యం చేసుకోవడానికి వాడుకుంటున్నాయి. భాను కిరణ్తోనూ,
భాను కిరణ్ వ్యవహారాలతోనూ, పులివెందులకు
చెందిన మంగలి కృష్ణతో భాను
కిరణ్ సంబంధాలతోనూ ఆ పార్టీలు వైయస్
జగన్కు సంబంధాలు అంటగడుతూ
తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు పరిటాల రవి హత్య కేసుతో
జగన్కు సంబంధం అంటగడుతూ
చాలా కాలంగా తెలుగుదేశం పార్టీ నాయకులు జగన్పై ఆరోపణలు
చేస్తున్న విషయం తెలిసిందే.
తాజాగా,
సూరి హత్య కేసుతోనూ జగన్కు ముడిపెట్టే ప్రయత్నాలు
చేస్తున్నారు. ఉప ఎన్నికల్లో జగన్ను దెబ్బ కొట్టడానికి
భాను కిరణ్ వ్యవహారాలను వాడుకుంటున్నారని
అంటున్నారు. జగన్కు ఓటేస్తే
ఊరికో భాను కిరణ్, మంగలి
కృష్ణ పుట్టుకొస్తారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు
ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో ఆరోపిస్తున్నారు. భాను కిరణ్ డబ్బులు
జగన్ అనుచరులకు పంచారంటూ ఇటీవల ఈనాడు దినపత్రికలో
ఓ వార్తాకథనం వచ్చింది. తెలుగుదేశం నాయకులు వర్ల రామయ్య, సోమిరెడ్డి
చంద్రమోహన్ రెడ్డి వంటివారు నిత్యం జగన్పై ఆరోపణలు
చేస్తూనే ఉన్నారు.
భానుతో
సంబంధాలపై జగన్ మాట్లాడాలని కాంగ్రెసు
సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు డిమాండ్
చేశారు. జగన్ సన్నిహితుడు మంగళి
కృష్ణకు తాను డబ్బులు ఇచ్చినట్లు
భాను విచారణలో ఒప్పుకున్నారన్నారు. దీనిపై ఆయన ఎందుకు మాట్లాడటం
లేదన్నారు. జగన్కు తిరుమల
శ్రీ వేంకటేశ్వర స్వామి వంటి దేవుడిపై భక్తి
లేదని విమర్శించారు. భాను కిరణ్తో
తనకు సంబంధాలు అంటగడుతూ వస్తున్న ఆరోపణలపై వైయస్ జగన్ స్వయంగా
ఆదివారంనాడు స్పందించారు. ఈనాడు దినపత్రికపై ఆయన
నిప్పులు చెరిగారు.
జగన్తో భాను కిరణ్
సంబంధాలను తిప్పికొట్టేందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కూడా సిద్ధమైనట్లే కనిపిస్తోంది.
కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కయి పథకం ప్రకారమే భాను
కిరణ్ను బయటకు తీసుకు
వచ్చారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అనంతపురం నియోజకవర్గం ఇంచార్జీ తోపుదుర్తి ప్రకాశ్ ఆరోపించారు. జగన్పై బురద
చల్లడానికే పథకం ప్రకారం భాను
చేత స్టేట్మెంట్ ఇప్పించారని ఆయన
సోమవారం అననారు. హంద్రీనీవా పనుల్లో తనకు భాను కిరణ్
డబ్బులు ఇచ్చాడనేది అబద్ధమని ఆయన అన్నారు.
0 comments:
Post a Comment