హైదరాబాద్:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో ఎ-2 నిందితుడు, జగతి
పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయ
సాయి రెడ్డి సోమవారం విచారణ నిమిత్తం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ)
ప్రత్యేక కోర్టులో హాజరయ్యారు. ఈ కేసు తదుపరి
విచారణను న్యాయస్థానం తిరిగి ఈ నెల 28వ
తేదికి వాయిదా వేసింది.
మరోవైపు
ఎమ్మార్ కేసులో సునీల్ జోషిని సిబిఐ అధికారులు గగన్
విహార్లోని ప్రత్యేక కోర్టులో
సిబిఐ అధికారులు హాజరు పరిచారు. సునీల్
జోషి తనకు బెయిల్ ఇవ్వాల్సిందిగా
కోర్టును ఇటీవల ఆశ్రయించారు. దీనిపై
సిబిఐ సోమవారం కౌంటర్ దాఖలు చేసింది. ఆయనకు
బెయిల్ ఇవ్వవద్దని కోరింది. ఈ కేసు విచారణనను
న్యాయస్థానం ఈ నెల 18వ
తేది వరకు వాయిదా వేసింది.
మరో నిందితుడు సునీల్ రెడ్డి రిమాండును సిబిఐ కోర్టు ఈ
నెల 17 వరకు పొడిగించింది.
కాగా
వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో సిబిఐ కోర్టు రెండోసారి
విజయ సాయి రెడ్డికి బెయిల్
ఇచ్చిన విషయం తెలిసిందే. తనకు
బెయిల్ ఇవ్వాలని అంతకుముందు విజయ సాయి రెడ్డి
సిబిఐ ప్రత్యేక కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. వాదోపవాదనల అనంతరం కోర్టు సాయికి బెయిల్ మంజూరు చేసింది. సిబిఐ దీనిని హైకోర్టులో
సవాల్ చేసింది.
విజయ
సాయి రెడ్డికి బెయిల్ ఇవ్వడం సరికాదని, బెయిల్ ఇచ్చేందుకు పూర్తి అంశాలను కోర్టు పరిగణలోకి తీసుకోలేదని హైకోర్టు చెప్పింది. ఈ సందర్భంగా ఆయన
బెయిల్ రద్దు చేస్తూ, మరోసారి
కోర్టులో బెయిల్ అంశాన్ని కోర్టులో తేల్చుకోవాలని సిబిఐకి, విజయ సాయికి సూచించింది.
దీంతో విజయ సాయి రెడ్డి
మరోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. రెండోసారి
కూడా కోర్టు అతనికి బెయిల్ ఇచ్చింది. ఆస్తుల కేసులో విజయ సాయి రెడ్డి
ఈరోజు కోర్టులో హాజరయ్యారు.
0 comments:
Post a Comment