చెన్నై:
మధురై ఆధీనం పీఠాధిపతిగా స్వామి
నిత్యానంద నియామకాన్ని మద్రాసు హైకోర్టు నిలిపివేసింది. నిత్యానంద నియామకాన్ని సవాల్ చేస్తూ ఓ
న్యాయవాది హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దాంతో
న్యాయస్థానం నియామకాన్ని నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా
నిత్యానంద స్వామిని మధురై ఆధీనం పీఠాధిపతిగా
ఏప్రిల్ 30వ తేదిన నియమించారు.
దీనిపై తీవ్ర దుమారం రేగింది.
పలు కేసులు ఎదుర్కొంటున్న నిత్యానందను పీఠాధిపతిగా నియమించడమేమిటని పలువురు ప్రశ్నించారు. ఆయనను వెంటనే తొలగించాలని
డిమాండ్ చేశారు. ఆయనను తొలగించే వరకు
ఊరుకునే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు.
పలువురు
నిత్యానందను తొలగించాలని డిమాండ్ చేస్తుండగా, ఆయన మాత్రం... తాను
ఎలాంటి సమస్యనైనా ధీటుగా ఎదుర్కొంటానని, మధురై ఆధీనం పీఠాధిపతి
స్థానాన్ని ఎంతో బాధ్యతగా స్వీకరించానని
చెప్పారు. తాను పీఠాధిపతిగా పలు
ఆలయాలు సందర్శిస్తానని చెప్పారు. అయితే ఆయన నియామకంపై
చెన్నై హైకోర్టు తాజాగా స్టే ఇచ్చింది.
కాగా
నిత్యానందపై తమిళనాడు, కర్నాటక కోర్టులలో పలుకేసులు ఉన్న విషయం తెలిసిందే.
ప్రధానంగా ప్రముఖ సినీ నటి రంజిత
రాసలీలల వ్యవహారం తీవ్ర దుమారం రేపింది.
ఈ రాసలీలల వ్యవహారంతోనే ఆయన పేరు పూర్తిగా
బయటకు వచ్చింది. ఈ కేసును ఆయన
ఎదుర్కొంటున్నారు.
0 comments:
Post a Comment