హైదరాబాద్:
తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో శుక్రవారం పార్టీ కార్యాలయంలో సమావేశమైంది. ఈ సమావేశంలో మహానాడు
నిర్వహణపై, త్వరలో జరగనున్న ఉప ఎన్నికలు, విజయవాడ
పట్టణ పార్టీ అధ్యక్షుడు వల్లభనేని వంశీ వ్యవహారంపై చర్చించే
అవకాశముంది. త్వరలో ఉప ఎన్నికలు ఉన్న
నేపథ్యంలో మహానాడును వాయిదా వేయాలా లేక ఉప ఎన్నికలు
జరిగే నియోజకవర్గాలలో పెట్టాలా అనే అంశంపై చర్చించనున్నారు.
వైయస్సార్
కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డిని వల్లభనేని వంశీ కలవడం టిడిపిలోనే
కాకుండా రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చ జరిగిన
విషయం తెలిసిందే. ఆ తర్వాత వంశీ
నేరుగా పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు
వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
కానీ ఆయన అపాయింటుమెంటు ఇవ్వకపోవడంతో
లేఖ ద్వారా వివరణ ఇచ్చారు. దీనిపై
వారు చర్చించనున్నారు.
ఉప ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా చర్చించనున్నారని తెలుస్తోంది. ఉప ఎన్నికలు జరుగుతున్న
ఒక్క నియోజకవర్గం కూడా తెలుగుదేశం పార్టీది
కాకపోయినప్పటికీ 2014 సాధారణ ఎన్నికలకు సెమీ ఫైనల్గా
అందరూ భావిస్తుండటంతో సత్తా చాటాలని టిడిపి
భావిస్తోంది. కాగా పోలిట్ బ్యూరో
సమావేశానికి అసంతృప్త నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
గైర్హాజరయ్యారు.
తెలుగుదేశం
పార్టీలో తన సామాజిక వర్గానికి
ప్రాధాన్యం తగ్గిపోయిందని, పార్టీలో తన సభ్యత్వ పునరుద్ధరణ
చేయలేదని, అందుకే తాను సమావేశానికి వెళ్లడం
లేదని ఉమ్మారెడ్డి గుంటూరు జిల్లా బాపట్లలో చెప్పారు. సమావేశానికి హాజరు కావాలని తనకు
వర్తమానం అందిందని, పార్టీ సభ్యత్వం కూడా ఇవ్వని చోటుకు
వెళ్లే ప్రసక్తి లేదని, అందుకే తాను ఆహ్వానాన్ని తిరస్కరించినట్లు
చెప్పారు.
కాగా
ఉమ్మారెడ్డితో పాటు రాజ్యసభ సభ్యుడు
హరికృష్ణ, తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఫోరం నేత, సీనియర్
శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకర రావు, ఉప్పులేటి
కల్పనలు పోలిట్ బ్యూరో భేటీకి గైర్హాజరయ్యారు. విజయవాడలో దమ్ము ఎఫెక్ట్ కారణంగా
హరికృష్ణ, పరకాల ఉప ఎన్నికలు
ఉండటంతో ఎర్రబెల్లి, విదేశీ పర్యటనలో ఉండటంతో కల్పన హాజరు కాలేదని
తెలుస్తోంది.
0 comments:
Post a Comment