సాయిరామ్
శంకర్, అడోనిక (పరిచయం) హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న
చిత్రం 'రోమియో'. 'పూరి రాసిన ప్రేమకథ'
అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న
ఈ చిత్రాన్ని మహర్షి సినిమా పతాకంపై వల్లూరిపల్లి రమేశ్ నిర్మిస్తున్నారు. పూరి
జగన్నాథ్ వద్ద సహాయ దర్శకునిగా
పలు చిత్రాలకు పనిచేసిన గోపిగణేశ్ ఈ చిత్రం ద్వారా
దర్శకునిగా పరిచయమవుతున్నారు. పూరి జగన్నాథ్ ఈ
చిత్రానికి కథ, మాటలు అందిస్తున్నారు.
సినిమా
గురించి దర్శకుడు గోపిగణేశ్ మాట్లాడుతూ "చరిత్రలో నిలిచిపోయిన ప్రేమజంట రోమియో, జూలియట్. వీరు యూరప్లో
కలిసే ప్రదేశం వెరోనా. దీని నేపథ్యంలో జరిగే
ప్రేమకథాచిత్రమే 'రోమియో'. యువతరాన్ని ఆకట్టుకునే అన్ని అంశాలూ ఇందులో
ఉంటాయి'' అని చెప్పారు.
నిర్మాత
వల్లూరిపల్లి రమేశ్ మాట్లాడుతూ "రెండు
పాటలు మినహా సినిమా పూర్తయింది.
ఈ నెల్లోనే అన్ని పనులూ పూర్తిచేసి,
త్వరలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. యూరప్లో అధిక
భాగం షూటింగ్ జరిపాం. ఎంతో కొత్తగా దర్శకుడు
చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు'' అని తెలిపారు.
గతంలో
పూరీ తన సోదరుడు సాయిరామ్
శంకర్ కోసం బంపర్ ఆఫర్
స్క్రిప్టుని ఇచ్చి తన శిష్యుడుతో
డైరక్ట్ చేయించారు. మళ్లీ ఈ సారి
అదే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో
సుబ్బరాజు, అలీ, ప్రగతి తారాగణమైన
ఈ చిత్రానికి పాటలు: భాస్కరభట్ల, విశ్వ, రెహమాన్, సంగీతం: సునీల్ కాశ్యప్, ఛాయాగ్రహణం: పి.జి. విందా,
కూర్పు: ఎస్.ఆర్. శేఖర్,
కళ: చిన్నా, ఫైట్స్: వెంకట్, కొరియోగ్రఫీ: రఘు, కథ, మాటలు:
పూరి జగన్నాథ్, స్కీన్ప్లే, దర్శకత్వం: గోపిగణేశ్.
0 comments:
Post a Comment