'ఓయ్' చిత్రంతో
పరిచయమైన ఆనంద్ రంగా, 'ఎవరైనా ఎపుడైనా'తో డైరక్టర్ అయిన శంకర్ మార్తాండ్ కలిసి ఓ
హారర్ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ స్వయంగా నిర్మిస్తున్నారు. ఆ చిత్రం టైటిల్ 'పొగ'.
'ఫియర్ ఈజ్ ఇన్‌జ్యూరియస్ టు లైఫ్' అనేది ట్యాగ్ లైన్. నవదీప్, మధుశాలిని, రణధీర్,
అర్చన, సౌమ్య ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రం గురించి
ఈ దర్సకులు ఇద్దరూ మాట్లాడుతూ...''తెలిసో, తెలియకో... జీవితంలో ప్రతి ఒక్కరు తప్పులు
చేస్తారు. మా కథలోనూ కొందరు అనుకోకుండా తప్పులు చేశారు. వాటి ఫలితం ఎలా అనుభవించారో
తెరపైనే చూడాలని'' చెబుతున్నారు. అలాగే ఈ చిత్రంలోని పాత్రలు అనుకోకుండా కొన్ని తప్పులు
చేస్తాయి. అయితే ఆ తప్పులకు వారు ఎలాంటి మూల్యాన్ని చెల్లించుకున్నారనేది ఈ చిత్రకథ.
వెన్నులో వణుకు పుట్టేవిధంగా ఇందులో సన్నివేశాలుంటాయి. 'జో డర్‌గయా వో మర్‌గయా' అనే
హిందీ పాపులర్ డైలాగ్ ఈ చిత్రానికి కూడా వర్తిస్తుంది'' అని చెప్పారు.
అలాగే...
"దర్శకులుగా మా ఇద్దరి ప్రయాణం ఒకేసారి మొదలుపెట్టాం. మా ఇద్దరి మదిలో మెదిలిన
ఒకే కథను ఇద్దరం కలిసి తెరకెక్కిస్తే బాగుంటుందనే ఆలోచనతో 'పొగ'కు శ్రీకారం చుట్టాం.
మేం అనుకున్నది అనుకున్నట్లుగా తెరపై చూసుకోవాలనే భావనతో దీన్ని సొంతంగా మేమే నిర్మిస్తున్నాం.
ఇప్పటివరకు అరవై శాతం షూటింగ్ పూర్తయింది. మిగతా షూటింగును జూన్‌లోగా పూర్తి చేస్తాం.
ఈ చిత్రంలో విజువల్ గ్రాఫిక్స్‌కు ఎంతో ప్రాధాన్యత ఉంది. సందర్భానుసారం వచ్చే మూడు
పాటలున్నాయి. ఇదొక హారర్ సినిమా అన్నారు.
నవదీప్, మధుశాలిని
ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రంలో అర్చన, రణదీప్, సౌమ్య, ఎమ్మెస్ నారాయణ, రావు రమేష్,వేణుమాధవ్,
పూనమ్ తదితరులు ఇతర పాత్రధారులు. సంగీతం: మహేశ్ శంకర్, కూర్పు: మార్తాండ్ కె.వెంకటేష్,
ఛాయాగ్రహణం: జయనన్ విన్సెంట్, కళ: రాజీవన్. సంగీతం: మహేష్ శంకర్.
0 comments:
Post a Comment