1981లో విడుదలైన
సూపహ్ హిట్ 'ఊరికి మొనగాడు'ను ఇప్పుడు మరోసారి హిందీలో రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే.
అజయ్ దేవగన్ హీరోగా చేస్తున్న ఈ చిత్రంలో తమన్నానే హీరోయిన్ గా ఖరారు చేసినట్లు సమాచారం.
హీరోయిన్స్ గా దీపిక పదుకొణె, కత్రినా కైఫ్, అనుష్క శర్మలను పరిశీలించారు. వారి కంటే
తమన్నా అయితే ఉత్తరాది ప్రేక్షకులకు కొత్తగా ఉంటుందని చిత్ర యూనిట్ భావించినట్లు తెలిసింది.
ఆమెతో సంప్రదింపులు సాగించి ఓకే చేసినట్లు సమాచారం.
గతంలో 1983లోనే
'ఊరికి మొనగాడు' చిత్రాన్ని 'హిమ్మత్‌వాలా'గా రీమేక్ చేసి హిట్ కొట్టారు. అప్పటి చిత్రంలో
జితేంద్ర, శ్రీదేవి జంటగా నటించారు. కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. 'హిమ్మత్‌వాలా'
తరవాత శ్రీదేవి హిందీలో స్టార్ గా ఎదిగింది. ఇప్పుడు సాజిద్‌ఖాన్ ఈ చిత్రాన్ని రీమేక్
చేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం పట్టాలు ఎక్కనుందని సమాచారం.
తమన్నా 2005లోనే
'చాంద్ స రోషన్ చెహ్రా' అనే హిందీ చిత్రంతోనే సినీ జీవితానికి శ్రీకారం చుట్టింది.
అయితే ఆ సినిమా డిజాస్టర్ కావటంతో దక్షిణాది చిత్రాలతోనే హీరోయిన్ గా సెటిలైంది. కొత్త
హిమ్మత్‌వాలాతో బాలీవుడ్‌లో కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టాలని ఆమె ఉత్సాహం చూపిస్తోంది.
ఆ చిత్రం రీమేక్ ద్వారా బాలీవుడ్‌లో తమన్నా సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభమవుతుంది అంటున్నారు.
అజయ్ దేవగన్ సైతం ఇక్కడి భామలపైనే ఆసక్తి చూపుతున్నారు. ఇంతకుముందు సింగం రీమేక్ లో
కాజల్ ని తీసుకున్నారు. ఇక ఇటీవలే చరణ్‌తో రచ్చ రచ్చ చేసిన తమన్నా తమిళంలోనూ బిజీయే.
ప్రస్తుతం ఆమె ప్రభాస్ సినిమా రెబెల్ చేస్తోంది. అలాగే రామ్ తో ఎందుకంటే ప్రేమంటే చిత్రం
కూడా చేస్తోంది.
కరుణాకరన్ దర్శకత్వంలో
రూపొంది విడులకు సిద్దమైన ఎందుకంటే ప్రేమంటలో ఆమె హీరోయిన్ గా చేస్తోంది. 'కందిరీగ'
తర్వాత హీరోగా రాం నటిస్తున్న సినిమా 'ఎందుకంటే.. ప్రేమంట!'. రాం సరసన తొలిసారిగా తమన్నా
నటిస్తున్న ఈ సినిమాకి ఎ. కరుణాకరన్ డైరెక్టర్. 'ఉల్లాసంగా ఉత్సాహంగా', 'డార్లింగ్'
వంటి హిట్ సినిమాల తర్వాత కరుణాకరన్ డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇదే. ఆమె ఎంత బిజీ అయ్యిపోయిందంటే
ఆమె డేట్స్ ఇబ్బంది అవుతున్నాయంటూ ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిషోర్ ఫిల్మ్ ఛాంబర్
లో కంప్లైంట్ చేసేటంతగా. ఊసరవెల్లి, బద్రీనాధ్ నెగిటివ్ రిపోర్టులు ఆమె కెరీర్ పై అస్సలు
ప్రభావం చూపకపోవటం విశేషం.
0 comments:
Post a Comment