కర్నూలు:
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై
సంవత్సర కాలంగా విమర్శలు చేస్తూ, విచిత్ర విన్యాసాల ద్వారా ఆయనను టార్గెట్ చేసిన
కర్నూలు జిల్లా మాజీ మేయర్ బంగి
అనంతయ్య ఆదివారం కాంగ్రెసు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా
శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, చిన్న
నీటి పారుదల శాఖ మంత్రి టిజి
వెంకటేష్ ఆధ్వర్యంలో ఆయన కాంగ్రెసు పార్టీలో
చేరారు.
ఈ సందర్భంగా ఆయన తాను బుద్దిలేక
ఇన్ని సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో పని చేశానని చెప్పారు.
అందుకు ఆయన లెంపలేసుకున్నారు. అంతేకాదు
కాంగ్రెసును వదిలి వెళ్లి పెద్ద
తప్పు చేశానని చెప్పారు. ఆయనకు పార్టీ కండువా
కప్పి బొత్స కాంగ్రెసులోకి ఆహ్వానించారు.
కాగా
బంగి అనంతయ్య గతంలో కాంగ్రెసు పార్టీలోనే
పని చేశారు. అయితే అక్కడ అసంతృప్తి
చెందిన బంగి తెలుగుదేశం పార్టీలో
చేరారు. ఆ పార్టీ నుండి
కర్నూలుకు తొలి మేయర్గా
ఎన్నికయ్యారు. ఆ తర్వాత చంద్రబాబును
రాజ్యసభ సీటు అడిగారు. అది
రాకపోవడంతో ఆయన గత కొంతకాలంగా
బాబుపై అసంతృప్తితో ఉన్నారు.
పలుమార్లు
చిత్ర విచిత్ర వేషాల ద్వారా చంద్రబాబుపై
మండిపడ్డారు. ఓసారి రిక్షా తొక్కి,
మరోసారి బిక్షమెత్తి ఇంకోసారి చీర కట్టుకొని మరోసారి
రోడ్లు ఊడ్చి ఇలా చంద్రబాబుకు
తన నిరసన తెలియజేశారు. చంద్రబాబును
నమ్ముకున్న తనకు భిక్షమెత్తుకునే పరిస్థితి
వచ్చిందని, రోడ్లు ఊడ్చే పరిస్థితి వచ్చిందని
ఆయన మండిపడ్డారు. సంవత్సరం క్రితం టిడిపిని అతనిని పార్టీ నుండి బహిష్కరించింది. ఇప్పుడు
బంగి బాబుపై అసంతృప్తితో తన సొంతగూటికి చేరుకున్నారు.
0 comments:
Post a Comment