హైదరాబాద్:
రాష్ట్రానికి సంబంధించి తాను కేంద్రానికి ఏ
విధమైన నివేదికలు ఇవ్వలేదని గవర్నర్ నరసింహన్ స్పష్టం చేశారు. మీడియా వార్తలను ప్రస్తావిస్తూ వాటి సారాంశమేమిటో ముందుగా
తనకు చెప్పాలని ఆయన చమత్కరించారు. రాష్ట్ర
గవర్నర్గా రెండోసారి నియమితులైన
ఆయన గురువారం రాజభవన్లో ప్రమాణస్వీకారం చేశారు.
దీన్ని రాష్ట్ర ప్రజలకు సేవ చేసేందుకు వచ్చిన
పవిత్రావకాశంగా తాను భావిస్తున్నట్లు ఆయన
తెలిపారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి శ్రమిస్తానని, రాష్ట్రంతో తనకున్న నాలుగున్నర దశాబ్దాల బంధం మరింత దృఢంగా
కొనసాగాలని ఆశిస్తున్నానని ఆయన అన్నారు. ప్రమాణ
స్వీకారం ఆనంతరం ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా
మాట్లాడారు.
చంద్రబాబు
రాలేదేమని ఆయన తెలుగుదేశం నాయకుడు
దాడి వీరభద్రరావును ప్రశ్నించారు. "చంద్రబాబు రాలేదేం, ఏం తీరిక లేదా,
శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చిన విందుకు కూడా వచ్చారే. ఈ
కార్యక్రమాన్ని రానివారందరనీ గుర్తు పెట్టుకుంటానని చంద్రబాబుతో చెప్పండి" ఆయన అన్నారు. ముఖ్యమంత్రి
కిరణ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు నాయకులు
ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు.
ఉప ఎన్నికలు పూర్తయిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తానని, రాష్ట్రంలో అనేక సవాళ్లున్నాయని, వాటిని
చక్కదిద్దాల్సిన బాధ్యత తనపై ఉందని ఆయన
మీడియాతో అన్నారు. ఏయే సవాళ్లని ప్రశ్నించగా
రాబోయేవంటూ సరిపెట్టారు. హైదరాబాద్, విశాఖలకే అభివృద్ధి పరిమితం కాకూడదని, మారుమూల గ్రామాలకు కూడా అభివృద్ధి ఫలాలు
అందాల్సిన అవసరం ఉందని ఆయన
చెప్పారు. మలేరియా వంటి వ్యాధులతో గిరిజనులు
బాధపడుతున్నారని, గిరిజనులకు మందులు అందడం లేదని ఆయన
అన్నారు. గిరిజన ప్రణాళికలు సరిగా అమలు చేయాల్సిన
అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఏజెన్సీ ప్రాంతాల్లోనే ఎక్కువగా పర్యటిస్తానని ఆయన చెప్పారు.
రాష్ట్ర
రాజకీయాలు ప్రస్తుతం బాగానే ఉన్నాయని, మున్ముందు శాంతిసౌభాగ్యాలతో అన్ని రంగాల్లో ఉజ్వలంగా
ముందుకు సాగాలని కోరుతున్నానని, శాంతియుతంగా, సుస్థిరంగా ఉంటేనే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని
ఆనయ అన్నారు. రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా రైతులు కష్టించే మనస్తత్వం తనను మంత్రముగ్ధుడిని చేసిందని
ఆయన అన్నారు. వ్యవసాయ, పారిశ్రామిక, ఐటి వంటి రంగాలన్నింటిలోనూ
రాష్ట్రం విశేష ప్రగతి సాధిస్తోందని
ఆయన అన్నారు.
0 comments:
Post a Comment