న్యూఢిల్లీ:
ఆగస్టు తర్వాత ఎప్పుడైనా తెలంగాణపై కేంద్రం ప్రకటన చేసే అవకాశం ఉందని
విజయవాడ కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ వ్యాఖ్యానించారు. తన నివాసంలో గురువారం
ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. మిగతా పార్టీలు తమ
తమ బాధ్యతల నుంచి తప్పుకొన్నా.. కాంగ్రెస్
మాత్రం బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తుందని, తెలంగాణ సమస్యను పరిష్కరిస్తుందని చెప్పారు.
లెక్కలేనన్ని,
గుర్తు పెట్టుకోలేనన్ని ప్రజా సంక్షేమ కార్యక్రమాలను
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిందని, వాటిని ఇంటింటికీ చేరిస్తే ఉప ఎన్నికలు జరిగే
18 స్థానాల్లోనూ కాంగ్రెస్ విజయావకాశాలు మెండుగా ఉన్నాయని తెలిపారు. ఉప ఎన్నికలు జరిగే
స్థానాల్లో పాదయాత్ర చేయాలని నిర్ణయించామని, దానికి ఇంకా విధి విధానాలు
ఖరారు కాలేదని చెప్పారు.
ఉప ఎన్నికల్లో తెలంగాణ ప్రచారాస్త్రం కాదని, అభివృద్ధి సంక్షేమాలే అజెండా అని తెలిపారు. వైయస్సార్
కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం
జరిగిందని, ఆ పార్టీలకు ఓటేస్తే
మురిగిపోయినట్లేనని, రాష్ట్ర అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి వారికి
వేసే ఓటు పనికిరాదని చెప్పారు.
తెలుగుదేశం,
కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయనే ప్రచారాన్ని ఖండించారు. అదే నిజమైతే తమ
పార్టీకి కొమ్ము కాస్తున్న సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులనే చంద్రబాబు నిలబెట్టి, తమ ఓట్లను చీల్చాలని
ఎందుకు చూస్తున్నాడో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.
0 comments:
Post a Comment