Showing posts with label Lagadapati. Show all posts
Showing posts with label Lagadapati. Show all posts

Monday, July 23, 2012

Lagadapati retaliates botsa and kcr

విజయవాడ: తెలంగాణ అంశంపై కాంగ్రెసు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను పరోక్షంగా విమర్శించి, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై ప్రత్యక్షంగా విమర్శలు చేశారు. రాష్ట్రం విడిపోతే ఏమవుతుందని అన్నవారు కృష్ణా డెల్టాకు నీటి విడుదలను అడ్డుకుంటే ఎందుకు ప్రశ్నించలేదని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేసిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని అభినందించకపోగా, అడ్డుకోవడాన్ని వ్యతిరేకించలేదని ఆయన అన్నారు. పొత్తూరి వెంకటేశ్వర రావు వంటి మేధావులు కూడా కృష్ణా డెల్టాకు నీటి విడుదలను అడ్డుకోవడాన్ని వ్యతిరేకించలేదని ఆయన అన్నారు.

దేశం విచ్ఛిన్నం కాకూడదనే ఉద్దేశంతోనే తాను సమైక్యవాదాన్ని వినిపిస్తున్నట్లు ఆయన తెలిపారు. కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేస్తుంటే కలిసి ఉన్నప్పుడే అడ్డుకుంటుంటే రాష్టం విడిపోతే ఏమవుతుందో ఊహించలేరా అని ఆయన అడిగారు. సెప్టెంబర్‌లో తెలంగాణ వస్తుందని సంకేతాలు అందినట్లు కెసిఆర్ చెబుతున్న మాటల్లో నిజం లేదని ఆయన అన్నారు. దొంగ మాటలతో ప్రజలను కెసిఆర్ మభ్యపెడుతున్నారని ఆయన అన్నారు.

తెలంగాణ వ్యతిరేకిగా ముద్ర వేసి ప్రణబ్ ముఖర్జీకి ఓటు వేయని తెరాస ఐదేళ్ల పాటు తెలంగాణ రాదని అంగీకరించినట్లేనా, తెలంగాణపై ఆశలు వదులుకున్నట్లేనా అని ఆయన అడిగారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఆయన అభినందనలతో ముంచెత్తారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడుతున్నారని, పార్టీలకు అతీతంగా నాయకుల పర్యటనకు భద్రత కల్పిస్తున్నారని, కిరణ్ కుమార్ రెడ్డి పోలీసులకు సహకరిస్తున్నారని ఆయన అన్నారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వరంగల్ జిల్లా పర్యటనకు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ నిజామాబాద్ జిల్లా పర్యటనకు, వైయస్ విజయమ్మ సిరిసిల్ల పర్యటనకు ఆటంకాలు లేకుండా కిరణ్ కుమార్ రెడ్డి భద్రతా ఏర్పాట్లు చేశారని ఆయన అన్నారు. ప్రణబ్ ముఖర్జీ ఐదేళ్ల పాటు రాష్ట్రపతిగా ఉంటారని, ఈ ఐదేళ్లు తెలంగాణ రాదని కెసిఆర్ అంగీకరించినట్లే కదా అని ఆయన అన్నారు.

Thursday, July 5, 2012

Lagadapati fire on ys vijayamma


న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ఢిల్లీ పర్యటనపై కాంగ్రెసు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ప్రతిస్పందించారు. విజయమ్మ తీరును ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్రంగా తప్పు పట్టారు. కుమారుడు వైయస్ జగన్ మీద ప్రేమతోనే విజయమ్మ ఢిల్లీ పర్యటన చేశారని ఆయన అన్నారు. కొడుకు తప్పులను కప్పిపుచ్చుకోవడానికి వైయస్ విజయమ్మ ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు.

మూడేళ్ల తర్వాత వైయస్ రాజశేఖర రెడ్డి మరణంపై విజయమ్మ అనుమానాలు వ్యక్తం చేయడం సరి కాదని, రాజకీయ ప్రయోజనాల కోసమే విజయమ్మ వైయస్ రాజశేఖర రెడ్డి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అన్యాయాలను తాము ప్రధాని మన్మోహన్ సింగ్కు వివరిస్తామని ఆయన చెప్పారు. ఎవరికీ లొంగకుండా పనిచేస్తుంటే సిబిఐ జెడి లక్ష్మినారాయణపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు.

న్యాయమూర్తిని కూడా కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి వర్గం ప్రలోభ పెట్టిందని, లొంగకుండా మొండికేస్తున్నందున లక్ష్మినారాయణపై కక్ష కట్టి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, మీడియా ఉంది కదా అని తప్పుడు కథనాలు ఇస్తున్నారని ఆయన అన్నారు. ముద్దుల కూతురు అరెస్టయిన డిఎంకె అధినేత కరుణానిధి మౌనం వహించారని, విషయాన్ని వైయస్ విజయమ్మ గమనించడం అవసరమని ఆయన అన్నారు. వైయస్ మృతిపై అనుమానాలు ఉన్నాయని చెప్పిన వైయస్ విజయమ్మ ప్రధాని వద్ద విషయాన్ని ఎందుకు ప్రస్తావించలేదని ఆయన అడిగారు.

కోర్టు ఆదేశాల మేరకే వైయస్ జగన్ ఆస్తులపై సిబిఐ దర్యాప్తు చేస్తోందని ఆయన చెప్పారు. రాజకీయ ప్రయోజనాల కోసం సిబిఐ దర్యాప్తును వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు వివాదం చేస్తున్నారని ఆయన అన్నారు. సిబిఐ దర్యాప్తులో జగన్ విషయాలన్నీ బయటకు వచ్చాయని ఆయన అన్నారు. కృష్ణా డెల్టాలో వరి తప్ప మరో పంట పండదని, వరి పంటకు నాగార్జునసాగర్ జలాలే ఆధారమని, సదుద్దేశంతోనే కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేయాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారని ఆయన అన్నారు. తెలంగాణలో ఎంబిబియస్, పిజి సీట్లు ఎక్కువగా ఉన్నాయని ఆయన అన్నారు.

Monday, July 2, 2012

Telangana is for hyderabad or water

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సీమాంధ్ర నాయకులు వ్యతిరేకించడానికి అసలు కారణం స్పష్టమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. వర్షాభావ పరిస్థితులు ఏర్పడడంతో కృష్ణా జలాల గొడవ రాష్ట్రంలో ప్రారంభమైంది. కృష్ణా జలాల కోసం రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజలు కూడా పట్టుబడుతున్నారు. కృష్ణా డెల్టాకు నాగార్జున సాగర్ నుంచి నీరు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో గొడవ ప్రారంభమైంది. నాగార్జునసాగర్ నీటి విడుదలను అడ్డుకోవడానికి నల్లగొండ జిల్లా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు.

కృష్ణా జలాలను కృష్ణా డెల్టాకు విడుదల చేయడాన్ని తాజాగా రాయలసీమలోని కర్నూలు జిల్లాకు చెందిన నాయకులు వ్యతిరేకించారు. కృష్ణా నదీ జలాలను శ్రీశైలం ప్రాజెక్టు నుంచి తమకే విడుదల చేయాలని కర్నూలు జిల్లా నాయకులు ఏరాసు ప్రతాపరెడ్డి, ఎస్పీవై రెడ్డి తదితరులు సోమవారం ముఖ్యమంత్రిని కోరారు. పరిస్థితి చూస్తుంటే సీమాంధ్ర నాయకులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించడానికి ముఖ్యంగా నదీ జలాలే కారణమని భావిస్తున్నారు.

రాష్ట్రంలోని రెండు ప్రధాన నదులు గోదావరి, కృష్ణాలు తెలంగాణ మీదుగా ప్రవహిస్తాయి. ఈ నదులకు సంబంధంచిన జలాల్లో తమకు దక్కాల్సిన వాటా దక్కడం లేదని మొదటి నుంచి తెలంగాణ నాయకులు విమర్శలు చేస్తున్నారు. తాజా వివాదంపై కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్, రాయపాటి సాంబశివ రావు చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించడానికి ప్రధాన కారణం నదీ జలాలనే విషయాన్ని తెలియజేస్తున్నాయి.

తెలంగాణ ఏర్పాటుకు హైదరాబాదు మాత్రమే కారణమని ఇంతకాలం అనుకుంటూ వస్తున్నారు. హైదరాబాదు కూడా ఒక్క కారణం కావచ్చు గానీ ప్రధానంగా నదీ జలాలే కారణమని తాజా ప్రకటనలు తెలియజేస్తున్నారు. రాష్ట్ర విభజన జరిగితే నీటి యుద్ధాలు జరుగుతాయని లగడపాటి రాజగోపాల్ ఇటీవల అంటూ కృష్ణా డెల్టాకు నీటి విడుదలపై చెలరేగిన రగడను ఉదహరించారు. ఈ విషయాన్ని ఆయన దాచి పెట్టలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కోస్తాంధ్రకు నాగార్జున సాగర్ నుంచి నీటి విడుదల విషయంలో ఆటంకం ఏర్పడుతుందనేది ఆయన ప్రధాన ఆరోపణగా కనిపిస్తోంది.

ఇదిలా ఉంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నీటి యుద్ధాలు జరుగుతాయని రాయపాటి సాంబశివ రావు సోమవారంనాడు అన్నారు. నిజానికి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌కు సంబంధించిన పలు అంశాల్లో నదీ జలాల వాటా కూడా ప్రధానమైంది. ఈ విషయాన్ని తెలంగాణ నాయకులు దాచిపెట్టడం లేదు. కృష్ణా జలాల్లో తమ వాటా తమకు దక్కడం లేదని తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు మాత్రమే కాకుండా తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నాయకులు కూడా అన్నారు.

గోదావరి జలాల వాడకానికి సంబంధించి తెలంగాణలో ప్రధానమే నీటి పారుదల ప్రాజెక్టు ఏదీ లేదు. కృష్ణా నదిపై ప్రాజెక్టులు ఉన్నప్పటికీ నీటి విడుదల విషయంలో వివక్ష ప్రదర్శిస్తున్నారనే విమర్శ వస్తోంది. తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాకు, కర్నూలు జిల్లాకు మధ్య రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ నీటి విషయంలో ఎప్పటికప్పుడు వివాదం తలెత్తుతూనే ఉన్నది. మొత్తం మీద, నదీ జలాలే సీమాంధ్ర నాయకులు తెలంగాణను వ్యతిరేకించడానికి ప్రధాన కారణమని తాజా పరిణామాలు తెలియజేస్తున్నాయి.

Sunday, July 1, 2012

Pranab Son common Employee : Lagadapati

హైదరాబాద్: మాజీ కేంద్రమంత్రి, రాష్ట్రపతి రేసులో ఉన్న ప్రణబ్ ముఖర్జీ దేశానికి ఎన్నో ఏళ్లు తన సేవలు అందించారని, అలాంటి నేత తనయుడు ఇప్పుడు సాధారణ ప్రభుత్వ ఉద్యోగి అని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు. ఆదివారం ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన యంగిస్థాన్ కార్యక్రమంలో విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు లగడపాటి సమాధానమిచ్చారు.

జగన్ అక్రమాలతో కాంగ్రెసు పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆయన చెప్పారు. తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రధానమంత్రి పదవినే తృణపాయంగా వదులుకున్నారని చెప్పారు. అవినీతిపరులు ఎంతటివారలైనా శిక్షార్హులే అని ఆయన అన్నారు. అవినీతిని ఒక్కరోజులో అంతమొందించడం కుదరదని ఆయన అభిప్రాయపడ్డారు. అక్రమాలు చేసిన వారు దొరికినప్పుడు కఠినంగా శిక్షిస్తే అక్రమాలు తగ్గుముఖం పడతాయని చెప్పారు.

ఎన్నికలను డబ్బు ప్రభావితం చేయలేదని చెప్పారు. తప్పు చేసిన వారు అంత తొందరగా దొరకరని చెప్పారు. జగన్ అక్రమాలు ఇప్పుడే వెలుగులోకి వచ్చాయని, ఆయన తండ్రి ఉన్నప్పుడు వెలుగులోకి రాలేదని చెప్పారు. కాంగ్రెసుకు ఎవరిమీదా కక్ష సాధించాల్సిన అవసరం లేదన్నారు. అందుకు మంచి ఉదాహరణ యుపిఏ భాగస్వామ్య పక్షమైన డిఎంకే అధినేత కరుణానిధి తనయ, ఆ పార్టీ ఎంపి కనిమొళి అరెస్టే అన్నారు.

అధికారంలో ఎక్కడో ఒకచోట అవినీతి ఉంటుందని చెప్పారు. తాను రాజకీయాలలోకి రాకముందే వ్యాపారాలు చేసి డబ్బు సంపాదించానని, ఇప్పుడు డబ్బు అవసరం తనకు అంతగా లేదని, రాజకీయాలలో అక్రమాలతో సంపాదించుకోవాల్సిన అవసరం అంతకంటే లేదన్నారు. తన తమ్ముడు లగడపాటి శ్రీధర్ ఎప్పటి నుండో జగన్ కంపెనీలలో పెట్టుబడులు పెడుతున్నారని, ఆర్థికంగా వారి కుటుంబాన్ని ఆదుకున్నారని, అలాంటి తన తమ్ముడి పైనా వారు విమర్శలు చేయడం శోచనీయమన్నారు.

Saturday, June 30, 2012

Mp Lagadapati comments on Krishna Delta Water


Telangana issue resolved in August : Lagadapati

తిరుపతి/ హైదరాబాద్: తెలంగాణపై ఆగస్టులో స్పష్టమైన వైఖరి వెలువడుతుందని కాంగ్రెసు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు. ఆయన శనివారం ఉదయం కలియుగ వైకుంఠ దైవం శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆ తర్వాత ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో కాంగ్రెసు 2014లో అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాజ్యసభ సభ్యుడు చిరంజీవికి త్వరలో కేంద్ర మంత్రి పదవి వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. ప్రణబ్ ముఖర్జీ 60 శాతం ఓట్లతో రాష్ట్రపతి అవుతారని ఆయన అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రిని మార్చాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.

ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మాత్రమే పరిష్కారమని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు రాజయ్య అన్నారు. రాష్ట్ర ఏర్పాటుపై ఇచ్చిన మాటకు తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా కట్టుబడి ఉంటారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఆయన శనివారం క్యాంప్ కార్యాలయంలో కలిశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో నాయకత్వ మార్పుపై తమకు ఆసక్తి లేదని ఆయన చెప్పారు. నాయకత్వ మార్పు వల్ల తెలంగాణకు ఏ విధమైన ఉపయోగం లేదని ఆయన అన్నారు. తమకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మాత్రమే కావాలని ఆయన అన్నారు.

Disclaimer

Buy original DVDs, CDs and cassettes from the nearest store. These are provided to give users the idea of best movies & music. All the rights are reserved to the audio company. This blog owner holds no responsibility for any illegal usage of the content.
Related Posts Plugin for WordPress, Blogger...

TW

Surfguiden
DMCA.com

feeds

Submit Blog & RSS Feeds Best Indian websites ranking submit site Increase traffic Entertainment Blogs
Entertainment directory BritBlog
Online Marketing
Oferty i praca w Zarabiaj.pl Submit Your Site To The Web's Top 50 Search Engines for Free!

wibiya widget