Showing posts with label VijayaWada. Show all posts
Showing posts with label VijayaWada. Show all posts

Monday, July 23, 2012

Lagadapati retaliates botsa and kcr

విజయవాడ: తెలంగాణ అంశంపై కాంగ్రెసు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను పరోక్షంగా విమర్శించి, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై ప్రత్యక్షంగా విమర్శలు చేశారు. రాష్ట్రం విడిపోతే ఏమవుతుందని అన్నవారు కృష్ణా డెల్టాకు నీటి విడుదలను అడ్డుకుంటే ఎందుకు ప్రశ్నించలేదని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేసిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని అభినందించకపోగా, అడ్డుకోవడాన్ని వ్యతిరేకించలేదని ఆయన అన్నారు. పొత్తూరి వెంకటేశ్వర రావు వంటి మేధావులు కూడా కృష్ణా డెల్టాకు నీటి విడుదలను అడ్డుకోవడాన్ని వ్యతిరేకించలేదని ఆయన అన్నారు.

దేశం విచ్ఛిన్నం కాకూడదనే ఉద్దేశంతోనే తాను సమైక్యవాదాన్ని వినిపిస్తున్నట్లు ఆయన తెలిపారు. కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేస్తుంటే కలిసి ఉన్నప్పుడే అడ్డుకుంటుంటే రాష్టం విడిపోతే ఏమవుతుందో ఊహించలేరా అని ఆయన అడిగారు. సెప్టెంబర్‌లో తెలంగాణ వస్తుందని సంకేతాలు అందినట్లు కెసిఆర్ చెబుతున్న మాటల్లో నిజం లేదని ఆయన అన్నారు. దొంగ మాటలతో ప్రజలను కెసిఆర్ మభ్యపెడుతున్నారని ఆయన అన్నారు.

తెలంగాణ వ్యతిరేకిగా ముద్ర వేసి ప్రణబ్ ముఖర్జీకి ఓటు వేయని తెరాస ఐదేళ్ల పాటు తెలంగాణ రాదని అంగీకరించినట్లేనా, తెలంగాణపై ఆశలు వదులుకున్నట్లేనా అని ఆయన అడిగారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఆయన అభినందనలతో ముంచెత్తారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడుతున్నారని, పార్టీలకు అతీతంగా నాయకుల పర్యటనకు భద్రత కల్పిస్తున్నారని, కిరణ్ కుమార్ రెడ్డి పోలీసులకు సహకరిస్తున్నారని ఆయన అన్నారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వరంగల్ జిల్లా పర్యటనకు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ నిజామాబాద్ జిల్లా పర్యటనకు, వైయస్ విజయమ్మ సిరిసిల్ల పర్యటనకు ఆటంకాలు లేకుండా కిరణ్ కుమార్ రెడ్డి భద్రతా ఏర్పాట్లు చేశారని ఆయన అన్నారు. ప్రణబ్ ముఖర్జీ ఐదేళ్ల పాటు రాష్ట్రపతిగా ఉంటారని, ఈ ఐదేళ్లు తెలంగాణ రాదని కెసిఆర్ అంగీకరించినట్లే కదా అని ఆయన అన్నారు.

Sunday, July 22, 2012

Jr Ntr fear about fans effect

కృష్ణా జిల్లా గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నాని వ్యవహారం హీరో జూనియర్ ఎన్టీఆర్‌కి తీవ్ర ఇబ్బందులనే కలిగిస్తోందని అంటున్నారు. తనకు అత్యంత సన్నిహితుడైన నాని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి జై కొట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీలో ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ తన విజయవాడ పర్యటన కూడా రద్దు చేసుకున్నారట.

జూనియర్ ఎన్టీఆర్ ఓ జ్యూవెల్లరీ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆ జ్యూవెల్లరీ కంపెనీ విజయవాడలో ఆదివారం ఓ షోరూంను ప్రారంభిస్తోంది. అక్కడ జూనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఫాలోయింగ్ ఉంది. దీంతో అతని చేతనే ఈ దుకాణాన్ని ఓపెనింగ్ చేయించేందుకు ఆ కంపెనీ నిర్ణయించుకుంది. జూ.ఎన్టీఆర్ ఇప్పటి వరకు ఆ కంపెనీ ప్రకటనలలో మాత్రమే కనిపించారు. ఏ దుకాణాన్ని ఓపెన్ చేయలేదు.

అయితే విజయవాడలో ఓపెనింగ్‌కు మాత్రం ఆయన అంగీకరించారట. ఈ జిల్లాతో తనకు వ్యక్తిగతంగా ఉన్న సంబంధాలు, సెంటిమెంట్ వంటి వాటి కారణంగా ఓపెనింగ్‌కు జూనియర్ అంగీకరించారట. అయితే చివరి నిమిషంలో జూనియర్ తన విజయవాడ పర్యటనను రద్దు చేసుకున్నారని తెలుస్తోంది. తాను మరో మూడు నెలల వరకు అందుబాటులో ఉండలేనని, కాబట్టి తాను లేకుండానే దుకాణాన్ని ప్రారంభించుకోవాలని కంపెనీ యజమానులకు విజ్ఞప్తి చేశారట.

జూనియర్ సున్నితంగా తిరస్కరించడంతో ఆ కంపెనీ ప్రముఖ బాలీవుడ్ మాజీ నటి, బిజెపి ఎంపి హేమమాలినిచే ఆ దుకాణాన్ని ప్రారంభింప చేయనుంది. అయితే జూనియర్ వెనక్కి తగ్గడం వెనుక నందమూరి అభిమానులు, టిడిపి కార్యకర్తలు ఎక్కడ అడ్డుకుంటారోననే ఆందోళనతోనే అని అంటున్నారు. కొడాలి నాని వ్యవహారం తర్వాత జిల్లాకు చెందిన నందమూరి అభిమానులు, టిడిపి కార్యకర్తలు జూనియర్ పైన గుర్రుగా ఉన్నారట.

ఇప్పటికై నాని జగన్ వైపు వెళ్లారు. జూనియర్‌కు సన్నిహితుడిగా ముద్రపడ్డ మరో నేత వల్లభనేని వంశీ వ్యవహారంపై కూడా వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారట. ఆయన పార్టీలో ఉంటారో ఉండరో అనే అనుమానాలు వారిని వెంటాడుతున్నాయట. తనకు సన్నిహితులుగా ముద్రపడిన వారిలో ఒకరు ఇప్పటికే వెళ్లడం, మరొకరిపై అనుమానాలు ఉన్న నేపథ్యంలో విజయవాడ వెళితే అభిమానుల నుండి ఆగ్రహం చవి చూడాల్సి వస్తుందని జూనియర్ భావించి ఉంటారని అంటున్నారు.

Sunday, June 24, 2012

Leadership will Change : Rayapati


విజయవాడ/హైదరాబాద్: రాష్ట్రపతి ఎన్నికల తరువాత పార్టీలో, ప్రభుత్వంలో మార్పులు వస్తాయని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు అన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మను ఆయన ఆదివారం దర్శించుకుని ప్రత్యేక అర్చనలు చేశారు. అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

ఉప ఎన్నికల్లో సానుభూతితోనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ గెలిచారని, 2014లో తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు. రాష్ట్ర పార్టీపై అధిష్ఠానానికి అసంతృప్తి ఉందని చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికల తరువాత రాష్ట్రంలో మార్పులు జరిగే అవకాశం ఉందన్నారు. పార్టీ ఎందుకు ఇంత ఘోరంగా ఓడిందన్నదానిపై విశ్లేషణ జరగాలన్నారు.

తాను, తన సోదరుడు కలిసి ప్రత్తిపాడు నియోజకవర్గంపై సమీక్ష జరపనున్నట్లు తెలిపారు. కాగా, దుర్గమ్మను దర్శించుకున్న రాయపాటి విమానగోపురం మరమ్మతులకోసం కిలో బంగారాన్ని విరాళంగా ఇస్తానని ఈవో రఘునాథ్కు తెలిపారు.

పార్టీ కోసం మంత్రులు పనిచేయాల్సిన సమయం వచ్చిందని కాంగ్రెసు ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని పార్టీని, ప్రభుత్వాన్ని సమూలంగా ప్రక్షాళన చేయక తప్పదని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. అవినీతి మంత్రులను తొలగించాలా, వద్దా అనే విషయంపై ప్రజల మనోభావాలకు అనుగుణంగా వ్యవహరించాలని ఆయన అన్నారు.

ఉప ఎన్నికల ఫలితాలపై కింది స్థాయి నుంచి అరమరికలు లేకుండా చర్చించుకోవాలని, ఆత్మ విమర్శ చేసుకోవాలని ఆయన అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల తర్వాత ప్రక్షాళన తప్పదని ఆయన అన్నారు.

Tuesday, May 22, 2012

Software crime in vijayawada


విజయవాడ: విజయవాడలోని సాఫ్ట్వేర్ కంపెనీ దాదాపు 70 మంది నిరుద్యోగ యువతను ముంచి బోర్డు తిప్పేసింది. ఉద్యోగులు ఇప్పిస్తామని హామీ ఇచ్చి కోటి రూపాయల దాకా వసూలు చేసిన సంస్థ యజమానులు కనిపించకుండా పోయారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు - విజయవాడలోని పటమట ప్రాంతంలోని వికెఎస్ సొల్యూషన్స్ ప్రమోటర్స్ మోసానికి పాల్పడ్డారు.

డాటా ప్రాసెసింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి వికెఎస్ సొల్యూషన్స్ ప్రమోటర్స్ మహేష్, కిశోర్, శివ యువకులు ఒక్కొక్కరి నుంచి లక్ష నుంచి ఐదు లక్షల రూపాయల వరకు వసూలు చేశారు. ఆరు నెలలలోగా డబ్బులు తిరిగి ఇచ్చేస్తామని కూడా ప్రమోటర్స్ చెప్పారు. అయితే, వారికి విధమైన ఉద్యోగం చూపించలేదు. ఆరు నెలలు గడిచిపోయినా ఫలితం కనిపించలేదు.

ప్రమోటర్స్తీరుపై అనుమానం వచ్చిన అభ్యర్థులు తమ డబ్బులు తిరిగి ఇచ్చేయాలని పట్టుబడుతూ వచ్చారు. ప్రమాదాన్ని పసిగట్టిన ప్రమోటర్లలో ఒకతను ఐపి పెట్టాడని తెలుస్తోంది. తర్వాత కనిపించకుండా పోయాడని అంటున్నారు.

అభ్యర్థులు సోమవారం ఉదయం వచ్చే సరికి సంస్థ కార్యాలయానికి తాళాలు వేసి ఉన్నాయి. దాంతో వారు పటమట పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Disclaimer

Buy original DVDs, CDs and cassettes from the nearest store. These are provided to give users the idea of best movies & music. All the rights are reserved to the audio company. This blog owner holds no responsibility for any illegal usage of the content.
Related Posts Plugin for WordPress, Blogger...

TW

Surfguiden
DMCA.com

feeds

Submit Blog & RSS Feeds Best Indian websites ranking submit site Increase traffic Entertainment Blogs
Entertainment directory BritBlog
Online Marketing
Oferty i praca w Zarabiaj.pl Submit Your Site To The Web's Top 50 Search Engines for Free!

wibiya widget