హైదరాబాద్:
బాలకృష్ణ ప్రస్తుతం ఊ కొడతారా ఉలిక్కి
పడతారా చిత్రంలో గెస్ట్ గా కనపించనున్నారు. అయితే
బాలకృష్ణ సినిమా చేస్తే గెస్ట్ గా ఎవరు ఉండాలి...అంటే జూనియర్ ఎన్టీఆర్
గెస్ట్ గా నటిస్తే బావుంటుంది.
అలాంటి ప్రాజెక్టు ఒకటి త్వరలో తెరకెక్కే
అవకాసం ఉందని ఫిల్మ్ సర్కిల్స్
లో వినపడుతోంది. బాలకృష్ణ తాజాగా రామకృష్ణ సినీ స్టూడియోస్ బ్యానర్
పతాకంపై రిజిస్టర్ చేసిన ఎన్టీఆర్ ప్రాజెక్టులో
ఈ సర్పైజ్ ఉండే అవకాసం ఉందని
తెలుస్తోంది. సీనియర్ ఎన్టీఆర్ పేరుని టైటిల్ గా పెట్టిన ఈ
చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ గెస్ట్ గా కొద్ది క్షణాల
పాటు నటిస్తాడని చెప్తున్నారు.
ఇక ఎన్టీఆర్ టైటిల్ కి ట్యాగ్ లైన్
ఏమిటంటే..నీతికి న్యాయానికి రారాజు. ఈ చిత్రాన్ని పెద్ద
దర్సకుడు డైరక్ట్ చేస్తాడని చెప్తున్నారు. ఇది వందో చిత్రం
అయ్యే అవకాసం ఉంది. ఈ చిత్రం
కోసం కథా చర్చలు జరుగుతున్నట్లు
తెలుస్తోంది. ఈ సినిమా పూర్తిగా
రాజకీయాల బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని చెప్తున్నారు.
ఈ సినిమాలో పెద్ద ఎన్టీఆర్ విజువల్
గ్రాఫిక్స్ తో కనపడతాని అంటున్నారు.
ఇక ఎన్టీఆర్ గెస్ట్ రోల్ లో గతంలో
వెంకటేష్ ..చింతకాయల రవి చిత్రంలో ఒక
పాటలో మెరిసారు. ఆ చిత్రం నిర్మాత
నల్లమలుపు బుజ్జితో ఉన్న అనుబంధంలో అప్పుడు
ఎన్టీఆర్ చేసారు.
ప్రస్తుతం
బాలకృష్ణ అతిధిపాత్రలో రూపొందిన చిత్రం ‘ఊకొడతారా..ఉలిక్కి పడతారా' చిత్రంపై అందరి దృష్టీ ఉంది.
జూలై 27న విడుదల అవుతున్న
ఈ చిత్రంకోసం బాలకృష్ణ 44 రోజులు కష్టపడి పనిచేశారని మోహన్ బాబు చెప్తున్నారు.
ఆయన మాట్లాడుతూ...బాలకృష్ణ పాత్ర చూసి జెలసీ
కూడా అనిపించింది. ‘పెదరాయుడు'లాంటి పాత్ర అది.
ఆ పాత్రను మిస్సయ్యాను అనే ఫీలింగ్ ఉంది.
ముఖ్యంగా బాలకృష్ణ నటన గురించి చెప్పుకోవాలి.
ఉదయం ఏడు గంటల నుంచి
మరుసటి రోజు ఉదయం ఏడింటి
వరకూ ఈ సినిమా కోసం
కష్టపడ్డాడు. అదంతా నా బిడ్డల
కోసమే. ఆయన పాత్ర అందరూ
ఉలిక్కిపడేలా వచ్చింది. తప్పకుండా ఈ చిత్రం ప్రేక్షకులకు
కొత్త అనుభూతిని పంచుతుంది. బాలకృష్ణ 44 రోజులు కష్టపడి పనిచేశాడు అన్నారు.
0 comments:
Post a Comment