హైదరాబాద్:మొదటి నుంచీ పవన్
కళ్యాణ్ మీడియాను దూరం పెడుతూనే వస్తున్నారు.
తన సినిమా హిట్టైనా, ప్లాపైనా మీడియాకు ఇంటర్వూలు ఇవ్వరు. గబ్బర్ సింగ్ లాంటి పెద్ద
విజయం సాధించిన తర్వాత కూడా ఆయన మీడియా
ఇంటర్వూలకు చాలా దూరంగా ఉండిపోయారు.
ఆయనే స్వయంగా ఓ ఇంటర్వూ ఎరేంజ్
చేసుకుని దాన్ని ఎడిట్ చేసి మీడియా
వారికి పంపారు కానీ మీడియాతో స్వయంగా
ఆయన ఇంటరాక్ట్ కాలేదు. ఇది టీవీ ఛానెల్స్
కు మింగుడు పడని విషయం. చాలా
టీవీ ఛానెల్స్ ఆయన ఇంటర్వూ కోసం
పీఆర్వోల మీద,మేనేజర్ల మీద
ప్రెజర్ తెచ్చినా ఫలితం లేకుండా పోయింది.
రీసెంట్
గా తెలుగు ఓ పాపులర్ టీవీ
ఛానెల్ ఆయన ఇంటర్వూ కోసం
శత విధాలుగా ప్రయత్నం చేసింది. కానీ ఉపయోగం లేదు.
దాంతో అసలు పవన్ కళ్యాణ్
ఎందుకని మీడియాకు దూరం ఉంటారు. ఆయన
తోటి హీరోలు మీడియాకు కంటిన్యూగా ఇంటర్వూలు ఇస్తూంటే ఆయన ఒక్కసారి కూడా
మీడియా ముందుకు రావటానికి ఎందుకు ఇష్టపడరనేది చర్చనీయాంసంగా మారింది. ప్రస్తుతం మీడియా పై ఆయన కెమెరామెన్
గంగతో రాంబాబు చిత్రం చేస్తున్నారు. అందులో మీడియా పై సెటైర్స్ ఉంటాయని
చెప్తున్నారు.
పవన్
కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో
యూనివర్సల్ మీడియా పతాకంపై డి.వి.వి.
దానయ్య నిర్మించే చిత్రం చిత్రం 'కెమెరామేన్ గంగతో రాంబాబు'. ఈ
చిత్రం నిమిత్రం పద్మాలయా స్టూడియోలో భారి సెట్ వేస్తున్నారు.
ఓ స్పెషల్ న్యూస్ టీవీ ఛానెల్ సెట్
ని అక్కడ వేసారు. ఈ
నెల 11 నుంచి 17 వ తేదీ వరకూ
ఇక్కడ షూటింగ్ జరగనుంది. ఇక సినిమాలో వచ్చే
కీ సీన్స్ మొత్తం ఇక్కడే షూట్ చేయనున్నారని సమాచారం.
అలాగే
పవన్ కళ్యాణ్ వేల మంది జనాల్ని
కలసే సీన్స్ కూడా ఇక్కడే షూటింగ్
కి ప్లాన్ చేస్తున్నారు. ఆ రోజు పవన్
ఫ్యాన్స్ ని పిలిచి ఆ
సీన్స్ షూట్ చేయాలని నిర్ణయించినట్లు
తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ సరసన
తమన్నా హీరోయిన్ గా చేస్తున్న ఈ
చిత్రం మీడియాపై పూర్తి స్ధాయి సెటైర్ గా ఉండబోతోందని చెప్తున్నారు.
ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ మెకానిక్
గా కనిపించనున్నారు. అలాగే 'గబ్బర్‌సింగ్' విజయాన్ని దృష్టిలో పెట్టుకుని, ఈ 'కెమెరామేన్ గంగతో
రాంబాబు' చిత్రాన్ని కమర్షియల్ సినిమాగా బిగ్గెస్ట్ హిట్ అయ్యేలా చేసే
గ్యారెంటీ తనదని పూరి చెబుతున్నాడు.
వచ్చే అక్టోబర్ 18న దీనిని విడుదల
చేయడానికి పూరి జగన్నాథ్ ప్లాన్
చేశాడు.
ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, అలీ,
ఎమ్మెస్ నారాయణ, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల
భరణి ఇప్పటి వరకు ముఖ్య తారాగణంగా
ఎంపికైన వారిలో ఉన్నారు. ఈ చిత్రానికి ఫోటో
గ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, ప్రొడక్షన్
డిజైనర్: చిన్నా, ఎడిటింగ్: ఎస్.ఆర్, శేఖర్,
ఫైట్స్: విజయ్, స్టిల్స్: మాగంటి సాయి, కో డైరెక్టర్:
విజయరామ్ ప్రసాద్, నిర్మాణం యూనివర్సల్ మీడియా, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డివివి దానయ్య, కథ, స్క్రీన్ ప్లే,
దర్శకత్వం: పూరి జగన్నాథ్.
0 comments:
Post a Comment