అభిమానలంతా
ఎంతగనో ఎదురుచూస్తున్న పవన్ కళ్యాణ్ తాజా
చిత్రం గబ్బర్ సింగ్ భారీ ఎత్తున
రిలీజైంది. ప్రతీ ధియోటర్ వద్ద
పండుగ లాంటి వాతావరణం నెలకొని
ఉంది. ఇప్పటికే చాలా చోట్ల ప్రిమియర్
షో లు పడ్డాయి. చాలా
చోట్ల బెనిఫిట్ షో లు అభిమాలతో
ప్రారంభమయ్యాయి. ఇక ఈ చిత్రం
అభిమానలకు విందు భోజనంలా మెప్పిస్తోంది.
పవన్ చెప్పే పంచ్ డైలాగులకు ధియోటర్
లో కంటిన్యూ విజిల్స్ పడుతున్నాయి. ఫ్యాన్ కి పండుగ అనిపించే
ఈ చిత్రం సెకండాఫ్ స్లో కావటం,ఎమోషన్
డెప్త్ మిస్సవటం జరిగింది. అది తప్పిస్తే సినిమా
సూపర్ హిట్ అవ్వటానకి ఛాన్సెస్
ఉన్నాయని ప్రైమరీ రిపోర్టు.
అయితే
ప్రీ క్లైమాక్స్ లో వచ్చే కెవ్వు
కేక పాట తో మళ్లీ
కిక్కు అందుకుని ఊహించని క్లైమాక్స్ తో సినిమా ముగియటం
బాగుందంటున్నారు. అలాగే పవన్ తమ్ముడుగా
వేసిన అజయ్ పాత్ర మరింత
బాగా చేసి ఉంటే బాగుండేది
అనిపిస్తోందని చెప్తున్నారు. శృతిహాసన్ కి చెప్పించిన డబ్బింగ్
సైతం అభిమానులను నిరాశపరుస్తోంది. అయితే ఓవరాల్ గా
ఇవి పెద్ద మైనస్ లు
కాకపోవటంతో సినిమా హ్యాపీగా చూసెయ్యచ్చు..ముఖ్యంగా పవన్ పాటల్లో మళ్లీ
ఖుషీ నాటి ఉత్సాహం కనపడి
మురిపిస్తోంది.
ఇక చిన్నప్పుడే షోలే సినిమా చూసి
గబ్బర్ సింగ్ కి అభిమానిగా
మారే ఢిఫెరెంట్ పాత్రగా పవన్ కనిపిస్తాడు. నాకు
కొంచెం తిక్కుంది అనే డైలాగు చెప్పినట్లుగానే
బిహేవ్ చేస్తూంటాడు. కథ మొత్తం కొండవీడు
అనే గ్రామంలో జరుగుతుది. అక్కడ కొండవీడు అడ్డాగా
చట్ట వ్యతిరేక కార్యకలాపాలకి పాల్పడుతుంటాడు సిద్ధప్పనాయుడు (అభిమన్యుసింగ్). అతని ఆట కట్టించడానికి
గబ్బర్సింగ్ (పవన్కల్యాణ్) అనే
ఓ పోలీస్ ఇన్స్పెక్టర్ ఆ
వూరికొస్తాడు. అతనికి కొంచెం తిక్కుంటుంది కానీ దానికీ ఓ
లెక్కుంటుంది. సిద్ధప్పనాయుడిని అతను ఎలా అదుపులో
పెట్టాడు? భాగ్యలక్ష్మి అలియాస్ బాల (శ్రుతిహాసన్)తో
గబ్బర్సింగ్కి ఎలా
పరిచయం ఏర్పడింది? వాళ్ల ప్రేమకథ ఫలించిందా?
లేదా? తదితర విషయాల్ని తెరపైనే
చూడాలి.
ఇది అవుట్ అండ్ అవుట్
పవన్ చిత్రం. పవన్ అవుట్ స్టాండిగ్
గా తన పాత్రలో జీవించాడు.
కామెడీ,పంచ్ డైలాగులు,తనదైన
శైలిలో స్టెప్స్ వేసి అలరిస్తున్నాడు. యాక్షన్
సీన్స్ లో అయితే విశ్వరూపం
చూపించాడని చెప్తున్నారు. శృతిహాసన్ ..అమాయికమైన పల్లెటూరు అమ్మాయి గా ఉన్నవి కొద్ది
సీన్స్ అయినా అదరకొట్టింది. కానిస్టేబులు
సాంబగా అలీ,పవన్ మధ్య
సీన్స్ నవ్విస్తే,బ్రహ్మానందం రికవరి రంజిత్ కుమార్ గా కెవ్వు కేక
అనిపిస్తాడు. సుహాసిని,నాగినీడు తమ పాత్రలకు న్యాయం
చేసారు. సిద్దప్ప నాయుడుగా అభిమన్యు సింగ్..పవన్ కి కరెక్టు
స్క్రీన్ విలన్ గా కనిపించి
నడిపిస్తాడు. ఇలా పూర్తిగా పవన్
బ్రాండ్ తో వచ్చిన గుడుంబా...
గబ్బర్ సింగ్.
0 comments:
Post a Comment