హైదరాబాద్:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై
పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సోమవారం
మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
దొంగ దొంగే అవుతాడని, దొంగ
దొర కాలేడని ఆయన వ్యాఖ్యానించారు. సానుభూతి,
ధనబలాలలో జగన్ ఉప ఎన్నికల్లో
విజయం సాధించాలని ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. సిబిఐ
దర్యాప్తును అడ్డం పెట్టుకుని జగన్
సానుభూతి పొందాలని చూస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
కాంగ్రెసును
గెలిపించాలని ప్రజలు కోరుకుంటున్నారని, కాంగ్రెసు కార్యకర్తలు ఐక్యంగా కృషి చేస్తున్నారని ఆయన
చెప్పారు. ప్రస్తుత ఉప ఎన్నికలు అవినీతికి,
నిజాయితీకి మధ్య జరుగుతున్నవని ఆయన
అన్నారు. తాము ఉప ఎన్నికల్లో
మెరుగైన ఫలితాలు సాధిస్తామని ఆయన దీమా వ్యక్తం
చేశారు. సంక్షేమం, అభివృద్ధికి కృషి చేస్తూ వంచనను
ఎదుర్కోవడానికి కాంగ్రెసు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు.
తమ పార్టీ పేరును కూడా చెప్పుకోలేని జగన్
కాంగ్రెసుపై విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ధనబలంతో
ఓటర్లను జగన్ ప్రలోభ పెడుతున్నారని
ఆయన అన్నారు. పార్టీ పేరును పక్కన పెట్టి కాంగ్రెసు
నాయకుడైన వైయస్ రాజశేఖర రెడ్డి
ఫొటో, సంక్షేమ పథకాలు జగన్ పెట్టుకున్నారని ఆయన
అన్నారు. జగన్ మీడియాపై సిబిఐ
చర్యలు తీసుకుంటే కాంగ్రెసును జగన్ విమర్శిస్తున్నారని ఆయన అన్నారు.
కుమ్మక్కయ్యారని తమపై ఆరోపణలు చేస్తున్నారని
ఆయన అన్నారు.
కాగా,
దావూద్ ఇబ్బహీం పత్రిక పెడితే జర్నలిజం ముసుగులో వదిలేస్తారా అని కాంగ్రెసు సీనియర్
నేత వి. హనుమంతరావు తూర్పుగోదావరి
జిల్లాలో ప్రశ్నించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మీడియా
సంస్థలపై చర్యలను ప్రశ్నించడాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఆయన ఆ
విధంగా అన్నారు. జగన్ దావూద్ ఇబ్రహీం
లాంటివాడేనని ఆయన అన్నారు. కాకినాడ
సెజ్ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని తిరిగి రైతులకు ఇచ్చేయాలని ఆయన కోరారు.
0 comments:
Post a Comment