విక్రమ్,
జగపతిబాబు, అనుష్క, లక్ష్మీరాయ్, అమీజాక్సన్ ప్రధానపాత్రధారులుగా యుటివి మోషన్ పిక్చర్స్ పతాకంపై
నిర్మిస్తున్న చిత్రం ‘తాండవం’.
ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన
షూటింగ్ లండన్లో జరుగుతోంది.
ఈ చిత్ర యూనిట్ సభ్యుల
నుంచి అందిన సమాచారం ప్రకారం
ఆగస్టులో సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
గతంలో
మదరాసి పట్టణం, నాన్న లాంటి చిత్రాలకు
దర్శకత్వం వహించిన ఎ.ఎల్. విజయ్
‘తాండవం’ చిత్రానికి
దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటకే మూడు వంతుల సినిమా
షూటింగ్ శాతం పూర్తయింది. తొలి
షెడ్యూలు ఢిల్లీలో, రెండో షెడ్యూలు చెన్నయ్లో చిత్రీకరించారు.
తెలుగు,
తమిళ ద్విభాషా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంలో విక్రమ్
ఓ సరికొత్త పాత్రలో కనిపించనున్నారు. చిత్ర నిర్మాతలు రోనిస్క్రూవాలా,
సిద్ధార్థ్రాయ్కపూర్ మాట్లాడుతూ
జగపతిబాబు ఈ చిత్రంలో ఓ
పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నారని,
చిత్రంలో అందరూ అద్భుతమైన కళాకారులు
పనిచేస్తున్నారని తెలిపారు.
విక్రమ్
లాంటి పెద్ద హీరో కావడం,
ఫ్యామిలీ ప్రేక్షకులు ఇష్టపడే జగపతి బాబు ప్రధానపాత్రలో
నటిస్తుండటంతో ఈ మల్టీ స్టారర్
సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ చిత్రానికి సంగీతం:
జి.వి.ప్రకాష్కుమార్,
కెమెరా: నీరౌషా, ఎడిటింగ్: ఆంథోనీ, నిర్మాతలు: రోనీస్క్రూవాలా, సిద్ధార్థ్రాయ్కపూర్, స్క్రీన్ప్లే, దర్శకత్వం: విజయ్.
0 comments:
Post a Comment