హైదరాబాద్:
ఏఐసిసి అధ్యక్షురాలు, యుపిఏ చైర్ పర్సన్
సోనియా గాంధీ దేవత అని
ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా
శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గురువారం
అన్నారు. సోనియా గాంధీని ఎవరు విమర్శించినా ఊరుకునేది
లేదని హెచ్చరిక చేశారు. తాను ఎనిమిదవ తేది
నుండి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని చెప్పారు. పార్టీ క్రమశిక్షణ చర్యలు ఎవరు ఉల్లంఘించినా చర్యలు
తప్పవని చెప్పారు.
కాగా
బొత్స సమక్షంలో తెలుగుదేశం పార్టీ నేత సమ్మా రావు
గురువారం కాంగ్రెసు పార్టీలో చేరారు. ఈ కార్యక్రమానికి మంత్రలు
పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజు సారయ్య, ఎంపి రాజయ్య హాజరయ్యారు.
పరకాల టిక్కెట్ను చివరి క్షణం
వరకు ఆశించి భంగపడ్డ గండ్ర వెంకట రమణ
వర్గం ఈ కార్యక్రమానికి హాజరు
కాలేదు.
ఈ సందర్భంగా సమ్మారావు మాట్లాడారు. కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుల కృషి చూస్తుంటే కాంగ్రెసుతోనే
తెలంగాణ సాధ్యమనిపిస్తోందన్నారు. కాంగ్రెసులోకి తన రాక సొంత
కుటుంబంలోకి వచ్చినట్లుగా ఉందన్నారు. గండ్ర వెంకట రమణ
రెడ్డిని రాజకీయాల్లోకి తీసుకు వచ్చింది తానేనని చెప్పారు.
సమ్మారావుకు
పరకాల టిక్కెట్ ఇచ్చే విషయమై జిల్లా
నేతల మధ్య ఎలాంటి విభేదాలు
లేవని మంత్రి పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. టిక్కెట్ ఎవరికి ఇచ్చినా పార్టీ నేతలం అందరం కలిసి
పని చేస్తామని చెప్పారు. సమ్మారావు ఒకప్పుడు కాంగ్రెసు పార్టీ నేతే అని చెప్పారు.
కాగా గండ్ర వెంకట రమణ
తన భార్య గండ్ర జ్యోతికి
పరకాల టిక్కెట్ ఆశించారు. అందుకోసం వారు రెండు నెలలుగా
అక్కడ పర్యటించి పార్టీని బలోపేతం చేశారు.
కానీ
చివరి నిమిషంలో బిసి నేత సమ్మారావును
టిక్కెట్ వరించింది. దీంతో గండ్ర తన
అసంతృప్తిని వ్యక్తం చేశారు. నిన్నటి వరకు తెలుగుదేశం పార్టీలోని
వ్యక్తికి కాంగ్రెసు పార్టీ టిక్కెట్ ఇవ్వడమేమిటని ఆయన ప్రశ్నించారు.
0 comments:
Post a Comment